రెజీనా తో…. మరోసారి శేష్?

అడివి శేష్ ప్రధాన పాత్ర లో ఇటీవలే విడుదల అయి పెద్ద విజయం సాధించిన సినిమా ‘ఎవరు’. ఈ సినిమా లో రెజీనా హీరోయిన్ గా నటించగా, నవీన్ చంద్ర ఒక కీలక పాత్ర పోషించాడు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో శేష్ తో పాటు రెజీనా కూడా ఎక్కువగా పాల్గొంది. రెజీనా నటన… ఈ సినిమా సక్సెస్ లో బాగా ఉపయోగపడింది…. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది.

శేష్ నటించిన గత రెండు హిట్ సినిమాలు క్షణం, గూఢచారి లో హీరోయిన్ మైనస్… పెద్దగా ఆ సినిమాలకి వారు ఉపయోగపడలేదు. కానీ రెజీనా మాత్రం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.

దీంతో అడివి శేష్ ఇప్పుడు…. రెజీనా తో మరోసారి పని చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. రెజీనా ని మరో సినిమా కి తీసుకుంటే… హిట్ పెయిర్ అనే ఇమేజ్ పని చేస్తుందని భావిస్తున్నాడట.