Telugu Global
Cinema & Entertainment

బ్యాంకాక్ లో.... బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్ తో డిజాస్టర్ ను అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ‘జైసింహ’ ఫేమ్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ‘రూలర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. థాయిలాండ్, బ్యాంకాక్ లో ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. బాలయ్య కూడా ఈ సినిమా షూటింగ్ తో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఆగస్టు 2వ […]

బ్యాంకాక్ లో.... బాలకృష్ణ
X

ఎన్టీఆర్ బయోపిక్ తో డిజాస్టర్ ను అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ‘జైసింహ’ ఫేమ్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ‘రూలర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

థాయిలాండ్, బ్యాంకాక్ లో ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. బాలయ్య కూడా ఈ సినిమా షూటింగ్ తో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఆగస్టు 2వ వారం ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ బ్యాంకాక్ లో మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం పాటలు మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత చిత్ర బృందం తిరిగి సెప్టెంబర్ 6న హైదరాబాద్ రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించబోతున్నారు.

ఒకవైపు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న బాలకృష్ణ మరోవైపు గ్యాంగ్ స్టర్ అవతారం కూడా ఎత్త నున్నాడు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ మరియు వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. అయితే గతంలో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జైసింహ’ డిజాస్టర్ అయింది… మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

First Published:  19 Aug 2019 11:26 PM GMT
Next Story