Telugu Global
NEWS

అమరావతి ముంపు ప్రాంతం... నిర్మాణంతో ప్రజాధనం వృథా

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలో పూర్తి వివరాలుంటాయన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సాధారణం కంటే అధికంగా వ్యయమవుతుందన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రాంతంగా తేలిపోయిందన్నారు. ఈ ముంపు నుంచి రక్షణ ఉండాలంటే కాల్వలు, డ్యాంలు నిర్మించాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని… ప్రజాధనం […]

అమరావతి ముంపు ప్రాంతం... నిర్మాణంతో ప్రజాధనం వృథా
X

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలో పూర్తి వివరాలుంటాయన్నారు.

అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సాధారణం కంటే అధికంగా వ్యయమవుతుందన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రాంతంగా తేలిపోయిందన్నారు.

ఈ ముంపు నుంచి రక్షణ ఉండాలంటే కాల్వలు, డ్యాంలు నిర్మించాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని… ప్రజాధనం వృథా అవుతుందని బొత్స వివరించారు. వరద నీటిని తోడేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి కూడా ఉంటుందన్నారు. త్వరలోనే రాజధాని అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని మంత్రి వివరించారు.

First Published:  20 Aug 2019 4:28 AM GMT
Next Story