Telugu Global
NEWS

పాము దొరికింది.... రైలు కదిలింది

కాకులు దూరని కారడవి కాదు అది.. చీమలు దూరని చిట్టడవి కాదు అది.. జనారణ్యంతో నిండిన కాంక్రీట్ జంగిల్. అయినా అంతటి జనసందోహంలోకి ఒక పాము రావడం.. లక్షలమంది ప్రయాణించే మెట్రోలో హల్ చల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్లో పాము కలకలం సృష్టించింది. వందలాది మంది ప్రయాణించే మెట్రోలోకి అంత ఎత్తున , ఫుల్ టైట్ సెక్యూరిటీ, గ్లాస్ ఫిట్టింగ్ తో ఉండే మెట్రోలో పాము కనిపించడంతో […]

పాము దొరికింది.... రైలు కదిలింది
X

కాకులు దూరని కారడవి కాదు అది.. చీమలు దూరని చిట్టడవి కాదు అది.. జనారణ్యంతో నిండిన కాంక్రీట్ జంగిల్. అయినా అంతటి జనసందోహంలోకి ఒక పాము రావడం.. లక్షలమంది ప్రయాణించే మెట్రోలో హల్ చల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్లో పాము కలకలం సృష్టించింది. వందలాది మంది ప్రయాణించే మెట్రోలోకి అంత ఎత్తున , ఫుల్ టైట్ సెక్యూరిటీ, గ్లాస్ ఫిట్టింగ్ తో ఉండే మెట్రోలో పాము కనిపించడంతో ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. అయితే ఆ రైల్లో పాము ఎక్కడికి పోయి దాక్కుందో కనిపించలేదు. దీంతో పాము కోసం ఆ రైలునే ఆపించేశారు అధికారులు.

ఎల్బీనగర్ స్టేషన్ లోని మెట్రో రైలులో ఈ పాము కనిపించింది. దీంతో ఆ రైలును ఈనెల 14 నుంచే ఆపేశారట…. అప్పటి నుంచి మెట్రో రైల్ ను స్టేషన్ లోనే ఉంచి ఆ పాము కోసం మొత్తం తనిఖీలు చేసినా పాము కనిపించలేదు.

దీంతో స్నేక్ సొసైటీ సభ్యులను రప్పించి పాము కోసం మెట్రో రైలు, స్టేషన్ లో శూలశోదన చేశారు.

తాజాగా రాత్రి పాము దొరకడంతో మెట్రో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల భద్రత కోసమే మెట్రో రైలును ఇన్ని రోజులు ఆపివేశామని… పాము దొరకడంతో ఇప్పుడు తిరిగి నడిపిస్తామని అధికారులు తెలిపారు.

First Published:  20 Aug 2019 4:55 AM GMT
Next Story