Telugu Global
NEWS

అఫ్ఘన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ పై ఏడాది నిషేధం

క్రమశిక్షణ తప్పిన కారణంగానే తీవ్ర చర్య అఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ షెజాదేపై ఏడాది నిషేధం విధించినట్లు అఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. క్రికెటర్ల నియమావళిని ఉల్లంఘించిన కారణంగానే నిషేధం శిక్ష విధించినట్లు క్రికెట్ బోర్డు వివరించింది. అప్ఘన్ క్రికెట్ బోర్డు అనుమతి లేకుండా శిక్షణ పేరుతో విదేశాలకు వెళ్లటం, స్వదేశంలో జరిగే శిక్షణ శిబిరాలకు గైర్హాజరు కావటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అప్ఘన్ బోర్డు ప్రకటించింది. స్వదేశంలోని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని […]

అఫ్ఘన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ పై ఏడాది నిషేధం
X
  • క్రమశిక్షణ తప్పిన కారణంగానే తీవ్ర చర్య

అఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ షెజాదేపై ఏడాది నిషేధం విధించినట్లు అఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. క్రికెటర్ల నియమావళిని ఉల్లంఘించిన కారణంగానే నిషేధం శిక్ష విధించినట్లు క్రికెట్ బోర్డు వివరించింది.

అప్ఘన్ క్రికెట్ బోర్డు అనుమతి లేకుండా శిక్షణ పేరుతో విదేశాలకు వెళ్లటం, స్వదేశంలో జరిగే శిక్షణ శిబిరాలకు గైర్హాజరు కావటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అప్ఘన్ బోర్డు ప్రకటించింది.

స్వదేశంలోని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అప్ఘన్ క్రికెట్ బోర్డు గుర్తు చేసింది. అయితే…స్వదేశీ సదుపాయాలను కాదనీ పదేపదే విదేశాలకు వెళ్లటాన్ని తీవ్రంగా పరిగణించినట్లు వివరణ ఇచ్చింది.

మహ్మద్ షెజాదే కు హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ గా పేరుంది. ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ లో పాల్గొన్న షెజాదే మోకాలిగాయంతో టోర్నీ సగం నుంచే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ షెజాదే పాల్గొనకుండా నిషేధం విధించింది. అప్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఏడాది నిషేధం ఎదుర్కొన్న తొలి క్రికెటర్ షేజాదే కావడం విశేషం.

First Published:  19 Aug 2019 11:57 PM GMT
Next Story