Telugu Global
National

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎర్త్‌?

భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న ఆలోచనను ఆర్‌ఎస్‌ఎస్ ఏదో ఒక రూపంలో బయటపెడుతూనే ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. పదేపదే రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు తెచ్చే ప్రయత్నం ఆర్‌ఎస్‌ఎస్ చేస్తోందని ఎస్సీ ఎస్టీ, బీసీ సంఘాలు, విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ప్రస్తుత దుమారానికి కారణం. దేశంలో రిజర్వేషన్లు సమీక్షించాల్సిందే అని గతంలో ఆయన సూటిగా వ్యాఖ్యానించారు. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, వివిధ […]

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎర్త్‌?
X

భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న ఆలోచనను ఆర్‌ఎస్‌ఎస్ ఏదో ఒక రూపంలో బయటపెడుతూనే ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. పదేపదే రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు తెచ్చే ప్రయత్నం ఆర్‌ఎస్‌ఎస్ చేస్తోందని ఎస్సీ ఎస్టీ, బీసీ సంఘాలు, విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ప్రస్తుత దుమారానికి కారణం.

దేశంలో రిజర్వేషన్లు సమీక్షించాల్సిందే అని గతంలో ఆయన సూటిగా వ్యాఖ్యానించారు. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా మరో కార్యక్రమంలో మోహన్ భగవత్… రిజర్వేషన్లపై సామరస్యంగా చర్చ జరగాలన్నారు. రిజర్వేషన్ల కోటాను వ్యతిరేకించే వారు… వాటిని సమర్ధించే వారితోనూ సామరస్యంగా మాట్లాడాలని సూచించారు.

ఇలా మోహన్ భగవత్ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి చర్చకు తేవడం పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి.

పేద ప్రజలను దెబ్బతీయడం, దళితులు, గిరిజనుల హక్కులను లాక్కోవడమే బీజేపీ అజెండా అన్నది ఆర్ఎస్ఎస్ చీఫ్‌ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ తొలి నుంచి కూడా ఎస్సీ ఎస్టీలు, బీసీలకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేత పీఎల్ పూనియా విమర్శించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు మొత్తం రిజర్వేషన్ల ఉనికినే ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు.

ఈ అంశంపై దుమారం రేగడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ సవరణ ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని… కేవలం సామరస్య పూర్వక వాతావరణంలో రిజర్వేషన్లపై చర్చించుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే భగవత్ గుర్తు చేశారని ప్రకటన విడుదల చేసింది.

First Published:  19 Aug 2019 11:48 PM GMT
Next Story