టీజర్ వచ్చింది…. పవన్ ఎక్కడ?

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సైరా టీజర్ వచ్చేసింది. మెగాభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆ టీజర్ భారీ ఎత్తున విడుదలైంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ టీజర్ వచ్చింది. టీజర్ లో విజువల్స్ అన్నీ భారీగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ రిచ్ గా ఉన్నాయి. ఇక చిరంజీవి లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆ లుక్ ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు టీజర్ లో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు

ఈ టీజర్ కోసం స్వయంగా పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించారు. ఆయన వాయిస్ ఓవర్ తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. ఆయన వాయిస్ ఓవర్ చెప్పిన మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ మేకింగ్ వీడియో హిట్ అయిన రేంజ్ లో, పవన్ వాయిస్ ఓవర్ హిట్ అవ్వలేదు. ఎందుకో ఎడిటింగ్ లో పవన్ వాయిస్ ను మార్చేశారు. వాయిస్ వినగానే అది పవన్ దే అని గుర్తుపట్టడానికి కాస్త టైమ్ పట్టింది. ఈలోగా ఆ వాయిస్ అయిపోతుంది కూడా. దీనికితోడు టీజర్ లో 2-3 గొంతులు ఉండడం వల్ల కూడా పవన్ వాయిస్ ఎలివేట్ అవ్వలేదు.

అయితే టీజర్ తో పవన్ పని అయిపోలేదు. సైరా సినిమాలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉన్న విషయాన్ని చిరంజీవి ధృవీకరించారు. సినిమా ప్రారంభం, ముగింపులో పవన్ వాయిస్ ఓవర్ వస్తుందని స్పష్టంచేశారు. సో.. టీజర్ తో ఆకట్టుకోలేకపోయినా, కనీసం సినిమాలోనైనా పవన్ వాయిస్ ఓవర్ తో అందర్నీ అలరిస్తాడేమో చూడాలి.