పూరి-విజయ్ సినిమాకు డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను ప్రకటించిన రోజు నుంచి ఈరోజు వరకు ఏదో ఒక రూపంలో అది ట్రెండింగ్ అవుతూనే ఉంది. పలు గాసిప్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో న్యూస్ మోసుకొచ్చాడు పూరి జగన్నాధ్.

విజయ్ దేవరకొండ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి తీసుకొస్తానని ప్రకటించాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ గ్యాప్ లో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేయడంతో పాటు తన ఫిజిక్ పై కాస్త దృష్టి పెడతానని ప్రకటించాడు. అటు విజయ్ దేవరకొండ కూడా ఈ గ్యాప్ లో క్రాంతిమాధవ్ సినిమాను పూర్తిచేయబోతున్నారు. ఆ వెంటనే పూరి సినిమా కోసం మేకోవర్ ప్రారంభిస్తాడు. జనవరి నాటికి మేకోవర్ పూర్తిచేసి సెట్స్ పైకి రావాలనేది విజయ్ టార్గెట్.

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది ఈ మూవీ. దీని కోసం పూరి-చార్మి కలిసి చాలా పెద్ద బడ్జెట్ అనుకున్నారు. ఎన్నడూలేని విధంగా పూరి జగన్నాధ్ ఈసారి హీరోయిన్ కోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నాడు. ఈ సినిమా కోసం శ్రీదేవి కూతురు జాన్విని తీసుకోవాలని అనుకుంటున్నాడు.