Telugu Global
Cinema & Entertainment

తరుణ్... రాజ్ తరుణ్... మీడియా కన్ఫ్యూజ్ అయి కంగారుపెట్టింది

ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఒక కారు ప్రమాదానికి సంబందించిన వార్త గురించి మీడియా రిపోర్ట్ చేస్తూ ఆ కారు లో ప్రయాణిస్తుంది హీరో తరుణ్ అని చెప్పింది. అయితే ఒక ఛానల్ ను చూసి మరో ఛానల్…. తరుణ్ కి యాక్సిడెంట్ అయిందని, తరుణ్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడని…. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు రిపోర్ట్ చేసేసారు. నిజానికి తరుణ్ కి… ఈ యాక్సిడెంట్ కి ఏ మాత్రము సంబంధము లేదు. పొద్దున్నే లేచి టీవీల్లో […]

తరుణ్... రాజ్ తరుణ్... మీడియా కన్ఫ్యూజ్ అయి కంగారుపెట్టింది
X

ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఒక కారు ప్రమాదానికి సంబందించిన వార్త గురించి మీడియా రిపోర్ట్ చేస్తూ ఆ కారు లో ప్రయాణిస్తుంది హీరో తరుణ్ అని చెప్పింది.

అయితే ఒక ఛానల్ ను చూసి మరో ఛానల్…. తరుణ్ కి యాక్సిడెంట్ అయిందని, తరుణ్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడని…. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు రిపోర్ట్ చేసేసారు.

నిజానికి తరుణ్ కి… ఈ యాక్సిడెంట్ కి ఏ మాత్రము సంబంధము లేదు. పొద్దున్నే లేచి టీవీల్లో ఇలా వార్తలు రావడం చూసి హడలిపోయిన తరుణ్ వెంటనే తనకీ… ఈ యాక్సిడెంట్ కి సంబంధంలేదని తేల్చి చెప్పేసాడు. అసలు యాక్సిడెంట్ జరిగిన సమయం లో తను తన ఇంట్లో ఉన్నట్టు తెగేసి చెప్పాడు తరుణ్.

అయితే ఈ యాక్సిడెంట్ గురించి పూర్తిగా ఆరా తీయగా, కొంత సేపటికి అసలు విషయం బయట పడింది.

నిజానికి రాజ్ తరుణ్ కార్ కి యాక్సిడెంట్ అయింది… రాజ్ తరుణ్ కి ఎటువంటి గాయాలూ కాలేదు…. సేఫ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

అయితే పొరపాటున రాజ్ తరుణ్ ప్లేస్ లో తరుణ్ పేరుని మెన్షన్ చేస్తూ మీడియా వార్తలని ప్రసారం చేయడంతో కంగారుపడ్డారు. అసలు విషయం తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  20 Aug 2019 4:15 AM GMT
Next Story