బాలీవుడ్ రీఎంట్రీపై చరణ్ క్లారిటీ

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నారు చిరంజీవి. అతడు నటిస్తున్న సైరా సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రీఎంట్రీ ఎప్పుడు? ఇదే ప్రశ్న చరణ్ కు ఎదురైంది. సైరా టీజర్ రిలీజ్ సందర్భంగా బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన రామ్ చరణ్ కు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పలేదు.

“బాలీవుడ్ నుంచి నేను దూరంగా జరగలేదు. మంచి కంటెంట్ దొరక్క హిందీలో సినిమా చేయలేకపోయాను. ఇన్నాళ్లకు సరైన స్టోరీ దొరికింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాను.”

ఇలా తన బాలీవుడ్ రీఎంట్రీపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ఇతడు జంజీర్ సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఓ కీలక పాత్రలో సంజయ్ దత్ నటించాడు. భారీ బడ్జెట్ తో తీసిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. రిలీజైన రోజు రెండో ఆటకే ప్రేక్షకులు ముఖం చాటేశారు.

ఆ దెబ్బకు బాలీవుడ్ నుంచి దుకాణం సర్దేశాడు రామ్ చరణ్. అయితే హిందీలో సినిమాలు చేయకపోయినా, బాలీవుడ్ జనాలతో మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వస్తున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఆర్-ఆర్-ఆర్ తో హిందీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు