”చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఓ వీరుడు”…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘సై రా నరసింహారెడ్డి’ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

మొన్న విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో…. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది.

“చరిత్ర… ఝాన్సీ లక్ష్మీ బాయి, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయుల ప్రాణ త్యాగాల్ని స్మరించుకుంటుంది… కానీ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు….” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది ఈ టీజర్.

ఒకవైపు మెగాస్టార్ అద్భుతమైన నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారబోతోంది అని టీజర్ చూస్తేనే చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా చిరు యాక్షన్ సన్నివేశాలలో నటించిన తీరు, ఎనర్జీ సినిమా పై అంచనాలు పెంచేస్తోంది.

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ లు నయనతార, విజయ్ సేతుపతి మరియు కన్నడ స్టార్ సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమవుతోంది.