చిదంబరం ఇంటిని చుట్టుముట్టిన సీబీఐ అధికారులు

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్ దాదాపు ఖాయమైంది. నాటకీయ పరిణామాల మధ్య చిదంబరం హఠాత్తుగా ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ మీడియాతో మాట్లాడాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి పోయాడు.

అప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు ఏఐసీసీ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. చిదంబరం ఇంటికి బయలు దేరారు.

దాంతో చిదంబరం కారు వెంటే సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ చిదంబరం సిబ్బంది… అధికారులను లోనికి రాకుండా గేట్లు వేశారు. దీంతో అధికారులు గోడ దూకి లోనికి వెళ్లారు. ఏ నిమిషంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం తన వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందన్నారు చిదంబరం. తాను విచారణకు తొలి నుంచి సహకరిస్తూనే ఉన్నానని చెప్పారు.