చిదంబరం అరెస్ట్…. ఇంటి నుంచి తరలింపు

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ అయ్యాడు. సీబీఐ ఆయన్ను ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి తరలించారు. నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కు సుప్రీం కోర్టు నో చెప్పడంతో చిదంబరం అరెస్ట్ తప్పలేదు.

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన ఆయన హఠాత్తుగా ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ మీడియాతో మాట్లాడాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి పోయాడు.

అప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు ఏఐసీసీ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.

దాంతో చిదంబరం కారు వెంటే సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ చిదంబరం సిబ్బంది… అధికారులను లోనికి రాకుండా గేట్లు వేశారు. దీంతో అధికారులు గోడ దూకి లోనికి వెళ్లారు. అరెస్ట్ చేసి బయటకు తెచ్చారు.