సినిమా సూపర్ హిట్ అయినా…. ఒక్క ఆఫర్ లేదు!

నిజజీవితంలో భార్యాభర్తలైన నాగచైతన్య మరియు సమంత ‘మనం’ సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కూడా భార్యా భర్తల్లాగా కనిపించిన సినిమా ‘మజిలీ’.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో మాత్రమే సమంత ఎంట్రీ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నాగ చైతన్య ఫస్ట్ లవ్ చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రకి ప్రాణం పోసింది దివ్యాంశ కౌశిక్. తన అద్భుతమైన నటనతో మొదటి సినిమా తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది దివ్యాంశ.

డెబ్యూ సినిమా హిట్ అవడంతో కచ్చితంగా తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది అని అందరూ అనుకున్నారు… కానీ పరిస్థితులు అలా లేవు. ‘మజిలీ’ సినిమా వచ్చి నాలుగు నెలలు గడిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అయినప్పటికి ఈమెకు తెలుగు నుంచి ఒక్క సినిమా ఆఫర్ కూడా రాకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మజిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తెలుగులో ఆఫర్లు లేకపోయినప్పటికీ…. తాజాగా ఈమె తమిళంలో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.