సాహోకు శ్రద్ధాకపూర్ రెమ్యూనరేషన్

దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది సాహో సినిమా. ఇంత భారీ బడ్జెట్ సినిమా కోసం ప్రభాస్ భారీగానే ఛార్జ్ చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. పైగా బాహుబలి తర్వాత మూవీ కావడంతో తన కెరీర్ లోనే అత్యంత భారీ మొత్తాన్ని ప్రభాస్ తీసుకొని ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ తన రెగ్యులర్ పారితోషికంలో కేవలం 20శాతం మాత్రమే తీసుకున్నానని ప్రభాస్ కుండబద్దలుకొట్టాడు. ఇప్పుడు శ్రద్ధాకపూర్ వంతు.

ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్ కు భారీగా సమర్పించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అటుఇటుగా 7 కోట్ల రూపాయలు ఇచ్చారని గాసిప్స్ వినిపించాయి ఆమధ్య. తాజాగా తన రెమ్యూనరేషన్ ను శ్రద్ధాకపూర్ బయటపెట్టింది. బాలీవుడ్ మీడియా చెబుతున్నట్టు తను ఈ సినిమాకు 7 కోట్లు తీసుకోలేదని, అటుఇటుగా కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నానని స్పష్టంచేసింది.

నిజానికి 3 కోట్లు అనేది పెద్ద మొత్తం కాదు. ఎఁదుకంటే శ్రద్ధాకపూర్ ఏకంగా రెండేళ్లు పనిచేసింది. ఈ రెండేళ్లలో హిందీలో 3 సినిమాలు చేసుకుంటే.. ఆమెకు ఇంతకంటే ఎక్కువ మొత్తమే వస్తుంది. కానీ సినిమా కథ, తన క్యారెక్టర్ నచ్చి సాహో చేయడానికి ఒప్పుకున్నానని, రెమ్యూనరేషన్ కోసం కాదని స్పష్టంచేసింది శ్రద్ధ.