స్టుడియో రౌండప్ (21-08-2019)

ఉప్పెన

ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడంటూ మొన్నటివరకు ప్రచారం సాగింది. కానీ ఇవాళ్టి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి విజయ్ సేతుపతి వచ్చేశాడు.

బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిషెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారధి స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది.

సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఇవాళ్టితో ఈ షెడ్యూల్ ముగుస్తుంది. 23 నుంచి రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

ఈ షెడ్యూల్ కోసం ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్ వేశారు. మహేష్, రష్మికపై ప్రధానంగా షూటింగ్ చేయబోతున్నారు.

ఎంత మంచివాడవురా

సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యూల్ ముగిసింది. 26 నుంచి రాజమండ్రి, తణుకు పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తారు.

మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. మెహ్రీన్ హీరోయిన్.

బంగారు బుల్లోడు

అల్లరి నరేష్, పూజా ఝవేరీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇదే లాస్ట్ షెడ్యూల్.

ఇది కూడా మరో 2 రోజుల్లో ముగుస్తుంది. దీంతో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. గిరి దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను దీపావళి టైమ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.