తెలుగులో విడుదల కాబోతున్న…. తమిళ వివాదాస్పద సినిమా

ప్రముఖ తమిళ హీరోయిన్ ఆండ్రియా జెరేమియా మరియు అంజలి కలిసి ‘తారామణి’ అనే ఒక రొమాంటిక్ సినిమాల్లో కలిసి నటించారు. తమిళంలో ఈ సినిమాలో వీరిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అయితే 2017 లోనే ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలో తెలుగులో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రముఖ తమిళ దర్శకుడు రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వసంత్ రవి హీరోగా నటించాడు. రొమాంటిక్ డ్రామాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా… చెన్నైలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది.

ముందు నుంచి బోల్డ్ కంటెంట్ తో వివాదాలకు దారి తీసిన ఈ సినిమా… విడుదలైన తర్వాత కూడా తమిళ్ లో బోలెడు వివాదాల్లో చిక్కుకుంది. మరి తెలుగులో ఈ వివాదాస్పద సినిమా ఎంతవరకు హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఉదయ్ హర్ష, వెంకటేష్ కలిసి ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు.