Telugu Global
NEWS

తెలుగుదేశం "చిట్టీ" చెల్లెలు అరెస్టు

పార్టీ సిద్ధాంతాలను ఆ “చిట్టీ” చెల్లెలు తూ.చ.తప్పక పాటించింది. నమ్ముకున్నవారిని మోసం చేయాలనే పార్టీ ప్రాధమిక సిద్ధాంతాన్ని అనుసరించి తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచింది. అధిక వడ్డీలు, చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 16 కోట్ల రూపాయలు వరకూ వసూలు చేసి బిచాణా ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల రూరల్ మండలం ఈపూరుపాలానికి చెందిన మాచర్ల పద్మావతి తెలుగుదేశం నాయకురాలు. చిట్టీలు, అధిక […]

తెలుగుదేశం చిట్టీ చెల్లెలు అరెస్టు
X

పార్టీ సిద్ధాంతాలను ఆ “చిట్టీ” చెల్లెలు తూ.చ.తప్పక పాటించింది. నమ్ముకున్నవారిని మోసం చేయాలనే పార్టీ ప్రాధమిక సిద్ధాంతాన్ని అనుసరించి తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచింది.

అధిక వడ్డీలు, చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 16 కోట్ల రూపాయలు వరకూ వసూలు చేసి బిచాణా ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాచర్ల పద్మావతి, ఆమె భర్త శ్రీరామ్మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చీరాల రూరల్ మండలం ఈపూరుపాలానికి చెందిన మాచర్ల పద్మావతి తెలుగుదేశం నాయకురాలు. చిట్టీలు, అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేయడం ఈమె వ్యాపారం. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మాచర్ల పద్మావతి ప్రజల నుంచి చిట్టీల రూపంలోను, అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి దాదాపు రూ. 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అసలేం జరిగిందంటే…

చీరాల రూరల్ మండలం ఈపూరుపాలానికి చెందిన మాచర్ల పద్మావతి గత కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేస్తోంది. దీంతో పాటు తన వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తానని కూడా ఆశ చూపించింది. దీంతో ఈపూరుపాలెం, బోయినవారి పాలెం, పేరాల, చీరాల, పిట్టువారిపాలెంతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన వారు అధిక మొత్తంలో చిట్టీలు వేశారు.

అంతే కాకుండా ఎక్కువ వడ్డీ ఇస్తారన్న ఆశతో లక్షలాది రూపాయలు పెట్టుబడిగా ఇచ్చారు. ఈ చిట్టీలలో రూ. 50 వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ఉన్నాయి.

కొంతకాలం సవ్యంగానే వ్యాపారం చేసిన మాచర్ల పద్మావతి ఆ తర్వాత చిట్టీలు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేసింది. గడచిన 15 నెలలుగా చిట్టీ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదు. ఈమె దగ్గర చిట్టీలు వేసిన వారిలో కూలీలు, రైతులు, ఐఎల్‌టీడీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 500 మంది వరకూ ఉన్నట్లు చెబుతున్నారు.

తమకు జరిగిన మోసాన్ని గుర్తించిన బాధితులు చివరకు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు పద్మావతి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

First Published:  20 Aug 2019 8:40 PM GMT
Next Story