కోడెల, ఆయన దూడలను… సస్పెండ్ చేసే ధైర్యముందా బాబూ?

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పై హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా ట్విట్టర్ లో ఆయన పై విరుచుకుపడ్డారు.

కోడెల శివప్రసాద రావు ఏపీ పరువు తీసేశారంటూ మండిపడ్డారు. ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీసిన కోడెలపై దొంగతనం కేసులు పెట్టాలని సూచించారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీలోని ఫర్నీచర్ ను తన ఇంటికి కోడెల తీసుకెళ్లిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విషయంపై తాజాగా ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ఇలా ఘాటు విమర్శలు చేశారు. స్పీకర్ హోదాలో ఉండి దొంగతనం చేసిన కోడెల దొంగే అని ఎద్దేవా చేశారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనం చేసి ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారు. కోడెల, ఆయన దూడలను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం…. చంద్రబాబుకు ఉందా? అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలి’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ తో ఎండగట్టారు.