Telugu Global
NEWS

ఏపీలో నాలుగు ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాలు, ప్రాంతాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బోర్డుల ద్వారా అన్ని జిల్లాలను సమంగా అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు విజయనగరం కేంద్రంగా ప్రాంతీయ ప్రణాళిక బోర్డు పనిచేస్తుంది. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు […]

ఏపీలో నాలుగు ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు
X

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాలు, ప్రాంతాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బోర్డుల ద్వారా అన్ని జిల్లాలను సమంగా అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు విజయనగరం కేంద్రంగా ప్రాంతీయ ప్రణాళిక బోర్డు పనిచేస్తుంది.

కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలతో ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ ప్రాంతీయ ప్రణాలిక బోర్డులకు మూడేళ్ల కాల వ్యవధితో చైర్మన్లను నియమిస్తారు. వివిధ రంగాల్లో నిపుణులైన నలుగురిని సభ్యులుగా నియమిస్తారు. ప్రాంతీయ ప్రణాళిక బోర్డుకు సరిపడ సిబ్బందిని నియమిస్తారు. కేబినెట్‌ హోదాలో చైర్మన్లను నియమించనున్నారు. ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు కాగానే రాష్ట్ర ప్రణాళిక మండలిని రద్దు చేస్తారు.

First Published:  21 Aug 2019 11:17 PM GMT
Next Story