డింపుల్ హయాతి స్టెప్పులు…

కంటెంట్ ఉన్న సినిమాలని ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్యనే దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి ‘వాల్మీకి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అథర్వ మురళి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ మాస్ అవతారంతో అందరిని షాక్కు గురి చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ‘జర్ర జర్ర’ లిరికల్ వీడియో నిన్న విడుదలైంది. దానికి సంబంధించిన వీడియో సాంగ్ టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ వీడియో సాంగ్ టీజర్ లో వరుణ్ తేజ్, డింపుల్ హయాతి డాన్స్ అదరగొట్టారు. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 13న విడుదలకు సిద్ధమవుతోంది.