ఎవరు మొదటి వారం వసూళ్లు

అన్నీ తానై అడవి శేష్ నటించిన ఎవరు సినిమా థియేటర్లలోకి వచ్చి వారం రోజులైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. మరి వసూళ్ల సంగతేంటి? సినిమా క్లిక్ అయిందా? అవును.. ఎవరు సినిమా రెవెన్యూ పరంగా కూడా సూపర్ హిట్ అయింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 9 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 9 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. అంటే దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్టే.

ఇంకా చెప్పాలంటే ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు వచ్చే వసూళ్లన్నీ లాభాల కిందే లెక్క. ఒక్క నైజాం నుంచే ఈ సినిమాకు వారం రోజుల్లలో 2 కోట్లు 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆంధ్రా ఏరియా నుంచి 2 కోట్లు 85 లక్షలు, సీడెడ్ నుంచి 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు 3 లక్షల 70 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఆస్ట్రేలియా, యూఏఈలో కూడా ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. సో.. ఓవరాల్ గా ఈ సినిమా హిట్ అనిపించుకుంది. అలా అడవి శేష్ ఖాతాలో వరుసగా మరో హిట్ చేరింది.

స్పానిష్ మూవీ ది ఇన్విజబుల్ గెస్ట్ సినిమాకు రీమేక్ గా ఎవరు సినిమాను తెరకెక్కించారు. వెంకట్ రామ్ జీ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది.