‘అల వైకుంఠపురం లో’…. భారీ అంచనాలు

ఎప్పుడో ‘నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా’ సినిమా తో కనిపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… తన తదుపరి సినిమాని ఓకే చేయడానికి చాలా కాలం తీసుకున్నాడు.

ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు బన్నీ.

తాజాగా ఈ సినిమాకి ‘అలా వైకుంఠపురంలో’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దానికి కారణం అల్లు అర్జున్ లాంగ్ గ్యాప్ తీసుకోవడం.

‘అల వైకుంఠపురంలో’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ‘నా పేరు సూర్య…’ సినిమాకి ఈ సినిమాకి మధ్య 20 నెలలు గడిచిపోయాయి. అంత కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

తమ ఆశలన్నీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాపైనే పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని లేకపోతే అది బన్నీ కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

దీంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అనే ప్రెజర్ చిత్ర బృందానికి బాగా ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.