Telugu Global
National

కేరళలో ఇక ప్రభుత్వ మహిళా డ్రైవర్లు

కేరళలో త్వరలోనే స్త్రీలను ప్రభుత్వ వాహనాలు నడపడానికి నియమించనున్నారు. ఇప్పటివరకు డ్రైవర్ పోస్టులకు పురుషులనే తీసుకుంటూ వచ్చారు. రవాణా రంగంలో పురుషాధిపత్యం మారిన ఈ కాలంలో ఇంకెంత మాత్రం కొనసాగకూడదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ లోని అన్ని శాఖలు, గవర్నమెంట్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థల్లోనూ భర్తీ చేసే అన్ని డ్రైవర్ పోస్టులకు స్త్రీలను కూడా పురుషులతో సమానంగా పరిగణించాలని క్యాబినెట్ నిర్ణయించింది. బుధవారం నాడు కేరళ స్టేట్ క్యాబినెట్ డ్రైవర్ పోస్ట్ లకి ఆడవారిని […]

కేరళలో ఇక ప్రభుత్వ మహిళా డ్రైవర్లు
X

కేరళలో త్వరలోనే స్త్రీలను ప్రభుత్వ వాహనాలు నడపడానికి నియమించనున్నారు. ఇప్పటివరకు డ్రైవర్ పోస్టులకు పురుషులనే తీసుకుంటూ వచ్చారు.

రవాణా రంగంలో పురుషాధిపత్యం మారిన ఈ కాలంలో ఇంకెంత మాత్రం కొనసాగకూడదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ లోని అన్ని శాఖలు, గవర్నమెంట్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థల్లోనూ భర్తీ చేసే అన్ని డ్రైవర్ పోస్టులకు స్త్రీలను కూడా పురుషులతో సమానంగా పరిగణించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

బుధవారం నాడు కేరళ స్టేట్ క్యాబినెట్ డ్రైవర్ పోస్ట్ లకి ఆడవారిని కూడా అర్హులుగా పరిగణించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆఫీసులో జరిగిన సమావేశంలో డ్రైవర్ పోస్టు ఇక ఎంత మాత్రం పురుషుడు అధిపత్యం చూపించే ఉద్యోగం కాదని భావించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని రూపొందించాలని పేర్కొన్నారు.

అన్నిఉద్యోగాల్లో లింగ భేదం లేకుండా నియమించాలనే గవర్నమెంట్ పాలసీని ఆధారం చేసుకుని ఈ చట్టం రూపొందనుంది. నిజానికి ఇప్పటికే కేరళలో ప్రైవేట్ బస్సులను, టాక్సీలను, ఆటోరిక్షా లను, అంబులెన్స్ లను కూడా మహిళలు నడుపుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే వీరు ప్రభుత్వ వాహనాలను కూడా నడుపుతారన్నమాట.

First Published:  22 Aug 2019 4:50 AM GMT
Next Story