Telugu Global
National

బెంగాల్ దీదీ.... సింప్లిసిటీ ఇదీ !

ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ప్రాంతీయ రాజకీయాలలోనే కాదు… జాతీయ రాజకీయాలలో కూడా ఫైర్ బ్రాండ్. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని, దశాబ్దాల పాటు కార్యకర్తల అండ ఉన్న సీపీఎం పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగించిన నాయకురాలు. ఆమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అందరూ ముద్దుగా పిలుచుకునే ‘దీదీ’. భారత రాజకీయాలలోనే కాదు… సామాజిక అంశాలలోనూ కూడా మమతా బెనర్జీది అసాధారణ శైలి. ముఖ్యమంత్రి అయినా….. సకల హంగులూ ఉన్నా… సాధారణ […]

బెంగాల్ దీదీ.... సింప్లిసిటీ ఇదీ !
X

ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ప్రాంతీయ రాజకీయాలలోనే కాదు… జాతీయ రాజకీయాలలో కూడా ఫైర్ బ్రాండ్. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని, దశాబ్దాల పాటు కార్యకర్తల అండ ఉన్న సీపీఎం పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగించిన నాయకురాలు. ఆమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అందరూ ముద్దుగా పిలుచుకునే ‘దీదీ’.

భారత రాజకీయాలలోనే కాదు… సామాజిక అంశాలలోనూ కూడా మమతా బెనర్జీది అసాధారణ శైలి. ముఖ్యమంత్రి అయినా….. సకల హంగులూ ఉన్నా… సాధారణ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చే మమతా బెనర్జీ మంగళవారం నాడు సామాన్యుల మధ్య సామాన్యురాలిగా తిరుగుతూ సంచలనం రేపారు.

ఎక్కడనుకుంటున్నారా… ఇంకెక్కడో కాదు… తన ఏలికలో ఉన్న పశ్చిమ బెంగాల్ లోనే. ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజధానికి చేరువలోని దీఘా సమీపంలోని దత్తాపూర్ కు వెళ్లారు దీదీ మమతా బెనర్జీ.

ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో దత్తాపూర్ లోని ఓ కిరాణ షాపు దగ్గర తన వాహనాన్ని నిలిపి వేయించారు మమతా బెనర్జీ.

హఠాత్తుగా కాన్వాయ్ ని నిలిపివేయమనడంతో సెక్యురిటీ సిబ్బందికి ఏమీ తోచలేదు. సీఎం కాన్వాయ్ ఆగగానే స్థానికులు కారును చుట్టుముట్టారు. కారులోంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగి నేరుగా కిరాణా షాపు వద్దకు నడుచుకుంటూ వెళ్లారు.

అక్కడ దుకాణదారుతో కొంతసేపు ముచ్చటించి అక్కడ ఓ మహిళ వొళ్లో ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. ఐదు నిమిషాల పాటు ఆ చిన్నారితో ఆడుకున్న సీఎం మమతా బెనర్జీ…. సెక్యూరిటీ సిబ్బందిని రావద్దంటూ వారించారు.

అనంతరం కిరాణా దుకాణం పక్కనే ఉన్న కాకా హోటల్ లో తానే స్వయంగా టీ కలిపారు. ఆ టీని తనే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు స్వయంగా ఇచ్చారు. ఆ దుకాణం దగ్గర ఉన్న వారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సహకరిద్దామని వచ్చినా… దీదీ వారిని సున్నితంగా తిరస్కరించారు. అక్కడ దాదాపు అరగంట గడిపిన మమతా బెనర్జీ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దత్తాపూర్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాదాసీదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మమతా బెనర్జీ సింప్లిసిటీపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.

First Published:  22 Aug 2019 12:18 AM GMT
Next Story