Telugu Global
National

మోడీ, షాల.... నెక్ట్స్ టార్గెట్ ఇతడేనా?

మాజీ హోం, ఆర్థిక మంత్రి చిదంబరం పని అయిపోయింది. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో అమిత్ షాను అరెస్ట్ చేయించి మూడు నెలలు జైల్లో పెట్టిన చిదంబరంపై ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. అయితే చిదంబరం పని ఖతమైంది. మరి నెక్ట్స్ ఎవరనే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి అందరూ చెబుతున్న పేరు మహారాష్ట్ర నవనిర్మాణ సేవ సమితి (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రేనే. మహారాష్ట్రలో బీజేపీకి కంట్లో […]

మోడీ, షాల.... నెక్ట్స్ టార్గెట్ ఇతడేనా?
X

మాజీ హోం, ఆర్థిక మంత్రి చిదంబరం పని అయిపోయింది. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో అమిత్ షాను అరెస్ట్ చేయించి మూడు నెలలు జైల్లో పెట్టిన చిదంబరంపై ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడని కథనాలు వెలువడుతున్నాయి.

అయితే చిదంబరం పని ఖతమైంది. మరి నెక్ట్స్ ఎవరనే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి అందరూ చెబుతున్న పేరు మహారాష్ట్ర నవనిర్మాణ సేవ సమితి (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రేనే. మహారాష్ట్రలో బీజేపీకి కంట్లో నలుసులా మారి విద్వేషాలు రెచ్చగొడుతూ చెలరేగిపోతున్న రాజ్ థాక్రేను బీజేపీ కార్నర్ చేసింది.

తాజాగా ఆయనపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఈరోజు ముంబైలో ఆయన్ను విచారించడానికి ఈడీ అధికారులు రెడీ అయ్యారు. దీంతో ఆయన కార్యకర్తలను అల్లర్లకు దిగవద్దని పిలుపునిచ్చారు. అయినా ఎంఎన్ఎస్ నేతలు ఊరుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

రాజ్ థాక్రేను విచారిస్తారా? అరెస్ట్ చేస్తారా? అన్న అనుమానాలున్న నేపథ్యంలో ముంబైలో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే ఎంఎన్ఎస్ కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. దీంతో ముంబైలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వెంటాడుతోంది.

కాగా బీజేపీని ఎదురించిన రాజ్ థాక్రేకు ఇప్పుడు ఐటీ, ఈడీ కేసులు ముట్టడం… ప్రతీకారంలో భాగమేనని ముంబై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీతో సామరస్యంగా ఉన్న శివసేనను వదిలి మోడీ-షాలు ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే పనికి తెరలేపారనే చర్చ సాగుతోంది.

First Published:  22 Aug 2019 2:06 AM GMT
Next Story