Telugu Global
National

నళినికి పెరోల్ మరో 3 వారాల పొడిగింపు

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి పెరోల్ ని మరో మూడు వారాల పాటు మద్రాసు హై కోర్టు పొడిగించింది. ప్రస్తుతం నళిని… కుమార్తె డాక్టర్ హరిత పెండ్లి ఏర్పాట్ల కోసం 30 రోజుల పెరోల్ పై సథువచారి థెరె లో నివసిస్తూ ఉన్నది. జస్టీస్ ఎం ఎం సుందరేష్, జస్టీస్ ఎం నిర్మల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచి ఇంతకు ముందు ఇచ్చిన […]

నళినికి పెరోల్ మరో 3 వారాల పొడిగింపు
X

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి పెరోల్ ని మరో మూడు వారాల పాటు మద్రాసు హై కోర్టు పొడిగించింది.

ప్రస్తుతం నళిని… కుమార్తె డాక్టర్ హరిత పెండ్లి ఏర్పాట్ల కోసం 30 రోజుల పెరోల్ పై సథువచారి థెరె లో నివసిస్తూ ఉన్నది.
జస్టీస్ ఎం ఎం సుందరేష్, జస్టీస్ ఎం నిర్మల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచి ఇంతకు ముందు ఇచ్చిన పెరోల్ నిబంధనలే ఈసారి కూడా వర్తిస్తాయని పేర్కొన్నది.

తన కుమార్తె పెండ్లి ఏర్పాట్లు 30 రోజుల్లో పూర్తి చేసుకోలేక పోయానని, మరో 30 రోజులు పెరోల్ పొడిగించాలని జైళ్ల శాఖ డీఐజికి విన్నవించుకున్నానని, కాని ఆయన ఆగస్టు 13న రాసిన లెటర్ లో తన విన్నపాన్ని తిరస్కరించడం తో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె కోర్టుకు విన్నవించుకున్నారు.

జులై 25న పెరోల్ పై జైలు నుంచి బయటికి వచ్చిన నళిని శ్రీహరన్ 27 ఏళ్లు గా జైలు జీవితం గడుపుతుంది. ఆమె కుమార్తె హరిత జైల్లోనే జన్మించింది. ప్రస్తుతం లండన్ లో డాక్టర్ గా హరిత పని చేస్తున్నారు.

First Published:  22 Aug 2019 10:33 AM GMT
Next Story