Telugu Global
International

న్యూజిలాండు స్పీకర్.... పిల్లవాడికి పాలు పడుతూ...

న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ చూపించిన సహృదయత ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంది. న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యురాలు తామతి కఫి తన చిన్నారి కొడుకును పార్లమెంట్ సమావేశాలకు తీసుకువచ్చింది. ఆ చిన్నారిని స్పీకర్ లాలించి తల్లిని చర్చల్లో పాల్గొనడానికి సహకరించిన తీరు ఇతర స్పీకర్లకు మార్గదర్శకం గా నిలిచింది. ఇటీవల తామతి మెటర్నిటీ సెలవు తీసుకుని పండంటి కొడుకును కన్నది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో నెలల బిడ్డతో సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చింది. స్పీకర్ ట్రెవర్ మల్లార్డ్ ఈ […]

న్యూజిలాండు స్పీకర్.... పిల్లవాడికి పాలు పడుతూ...
X

న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ చూపించిన సహృదయత ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంది.

న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యురాలు తామతి కఫి తన చిన్నారి కొడుకును పార్లమెంట్ సమావేశాలకు తీసుకువచ్చింది. ఆ చిన్నారిని స్పీకర్ లాలించి తల్లిని చర్చల్లో పాల్గొనడానికి సహకరించిన తీరు ఇతర స్పీకర్లకు మార్గదర్శకం గా నిలిచింది. ఇటీవల తామతి మెటర్నిటీ సెలవు తీసుకుని పండంటి కొడుకును కన్నది.

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో నెలల బిడ్డతో సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చింది. స్పీకర్ ట్రెవర్ మల్లార్డ్ ఈ బుజ్జి బాబును తన ఒడిలో కూర్చోపెట్టుకుని సీసా పాలు పట్టాడు. ఒకపక్క స్పీకర్ గా పార్లమెంట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తూనే… పిల్లవాడికి పాలు పట్టి నిద్రపుచ్చారు.

ఆయన ఆ బాబు తో ఉన్న ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ… “సాధారణంగా స్పీకర్ సీటులో సభకు అధ్యక్షత వహించేవారు మాత్రమే కూర్చుంటారు. కానీ ఇవ్వాళ నాతోపాటు ఓ వి ఐ పి కూడా కూర్చున్నాడు. మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక సందర్భంగా తామతి కఫి, జిమ్ లకు నా శుభాకాంక్షలు” అని కామెంట్ పెట్టారు. ఇది ఇంటర్నెట్లో వైరల్ అయింది.

మల్లార్డ్ స్పీకర్ పదవిని అలంకరించిన దగ్గర్నుండి పార్లమెంటులో చాలా మార్పులు తీసుకువచ్చారు. పార్లమెంటును ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్పేస్ గా మార్చారు. ఈ మార్పు మహిళా ఎంపీలకు ఒక వరంగా పరిణమించింది. పసిపిల్లల తల్లులైన ఎంపీలు పార్లమెంట్ ఫ్లోర్ లోనే పిల్లలకు చనుబాలు ఇవ్వవచ్చు న్యూజిలాండ్‌ లో.

First Published:  22 Aug 2019 5:43 AM GMT
Next Story