డైలాగ్ డెలివరీ పై కాన్ఫిడెన్స్ లేదట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించనటువంటి విధంగా పాజిటివ్ రెస్పాన్స్ అందింది.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోంది. విడుదల కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉండడంతో చిత్రబృందం కూడా సినిమా ప్రమోషన్స్ పై బాగానే దృష్టి పెడుతోంది.

మరోవైపు ప్రభాస్ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ప్రభాస్ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశాడు.

తన డైలాగ్ డెలివరీ పై తనకి అంత కాన్ఫిడెన్స్ లేదని…. డైలాగ్ డెలివరీ విషయంలో ప్రతి సినిమాలోనూ వర్క్ చేస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఈ విషయం అందరినీ షాక్ కి గురి చేసింది.

దాదాపు ప్రభాస్ నటించిన అన్ని సినిమాల్లోనూ ముఖ్యంగా క్లైమాక్స్ లేదా ఇంటర్వెల్ సన్నివేశాలలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రభాస్ చెప్పిన చాలా పంచ్ డైలాగులు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. అలాంటిది ప్రభాస్ తన డైలాగ్ డెలివరీ పై కాన్ఫిడెన్స్ లేకపోవడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ ‘సాహో’ సినిమా ని యు.వి.క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.