గబ్బర్ సింగ్ సీక్వెల్ తో… సురేష్ బాబు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబంగ్’ మరియు ‘దబాంగ్ 2’ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలకి సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘దబంగ్ 3’ అనే టైటిల్ తో ఈ సినిమా డిసెంబర్ 20, 2019న విడుదల కాబోతోంది. అయితే నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రం రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

గతంలోనే ఈ సినిమా దర్శకనిర్మాతలు హిందీతో పాటు కొన్ని సౌత్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ట్విట్టర్ ద్వారా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది.

సురేష్ బాబు ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశారట. నిజానికి ‘దబాంగ్’ మరియు ‘దబాంగ్ 2’ సినిమాలు తెలుగులో ‘గబ్బర్ సింగ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా రీమేక్ అయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు దూరం అవడంతో ఈ సినిమాని రీమేక్ చేయడం కంటే డైరెక్ట్ గా డబ్బింగ్ చేయడం బెటర్ అని సురేష్ బాబు నిర్ణయించుకున్నాడని చెబుతున్నారు.