Telugu Global
NEWS

ఆగస్టు 22 నుంచి భారత్ -విండీస్ టెస్ట్ సిరీస్

భారత్ తో టెస్ట్ సిరీస్ కు గేల్ ను పట్టించుకోని సెలెక్టర్లు ఐసీసీ టెస్ట్ టోర్నీలో భాగంగా రెండుమ్యాచ్ ల సమరం టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో ఈనెల 22 నుంచి జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కమ్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కోసం ప్రకటించిన విండీస్ జట్టులో డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు చోటు దక్కలేదు. ఆంటీగా సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఆగస్టు 22 నుంచి 24 […]

ఆగస్టు 22 నుంచి భారత్ -విండీస్ టెస్ట్ సిరీస్
X
  • భారత్ తో టెస్ట్ సిరీస్ కు గేల్ ను పట్టించుకోని సెలెక్టర్లు
  • ఐసీసీ టెస్ట్ టోర్నీలో భాగంగా రెండుమ్యాచ్ ల సమరం

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో ఈనెల 22 నుంచి జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కమ్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ కోసం
ప్రకటించిన విండీస్ జట్టులో డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు చోటు దక్కలేదు.

ఆంటీగా సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకూ జరిగే తొలిటెస్ట్ తో పాటు జమైకా లోని కింగ్స్ టన్ వేదికగా జరిగే ఆఖరి టెస్ట్ కోసం… జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలో 14 మంది సభ్యుల జట్టును కరీబియన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

గేల్ రిటైర్మెంట్ టెస్ట్ కు నో…

2014 లో తన కెరియర్ లో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడిన గేల్ కు మొత్తం 103 టెస్టులు ఆడిన అపార అనుభవం ఉంది. అయితే.. గత ఐదేళ్లుగా.. గేల్ కేవలం వన్డే, టీ-20 ఫార్మాట్లకు మాత్రమే పరిమితమవుతూ వచ్చాడు.

భారత్ తో ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గేల్ హోమ్ గ్రౌండ్ కింగ్స్ టన్ వేదికగా ఆఖరి టెస్ట్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా తన కెరియర్ కు గుడ్ బై చెప్పాలని గేల్ భావించాడు.

అయితే సెలెక్టర్లు మాత్రం…సెంటిమెంట్లకు పోకుండా గేల్ ను పక్కనపెట్టి.. మరీ తుదిజట్టును ప్రకటించారు.

103 టెస్టులు…7వేల 214 పరుగులు..

గేల్ కు 103 టెస్టులో 333 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు…7వేల 214 పరుగులు సాధించిన అసాధారణ రికార్డు ఉంది. గేల్ టెస్ట్ కెరియర్ 103 టెస్టులతోనే ముగిసిపోడం ఖాయంగా కనిపిస్తోంది.

కార్న్ వాల్ కు టెస్ట్ క్యాప్…

గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్నఆఫ్ స్పిన్నర్ రకీం కార్న్ వాల్ కు 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 260 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.

విండీస్ టెస్టు జట్టులో చోటు కోసం ఎంతోకాలం నుంచి ఓపికతో ఎదురుచూస్తున్న కార్న్ వాల్ కు టెస్ట్ క్యాప్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే విండీస్ జట్టులో…క్రెగ్ బ్రాత్ వెయిట్, డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, జాన్ కాంప్ బెల్, రోస్టన్ చేజ్, రకీం కార్న్ వాల్, షేన్ డార్విచ్, షానన్ గేబ్రియల్, షిమ్రాన్ హెట్ మేయర్, షై హోప్, కీమో పాల్, కేమర్ రోచ్ ఉన్నారు.

First Published:  21 Aug 2019 10:00 PM GMT
Next Story