Telugu Global
National

వైఎస్‌ సీఎంగా ఉన్నా... నేరుగా ఫోన్లు చేసిన చిదంబరం...

చిదంబరం కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు అన్నిఇన్నీ కావు. నచ్చనివారిని వేధించడం, తన, తన భార్య క్లయింట్లను కేసుల నుంచి రక్షించే ట్రాక్ రికార్డు కూడా ఈయన పేరున ఉంది. సుబ్రమణ్య స్వామి మీద కోపంతో 1997లోనే ఆయన్ను అరెస్ట్ చేయించేందుకు అప్పటి దేవేగౌడ కేబినెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇతడి వ్యక్తిగత ద్వేషాన్ని పసిగట్టిన ప్రధాని దేవేగౌడ అరెస్ట్ వారెంట్లను రద్దు చేయించారు. పుట్టపర్తి […]

వైఎస్‌ సీఎంగా ఉన్నా... నేరుగా ఫోన్లు చేసిన చిదంబరం...
X

చిదంబరం కేంద్ర హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు అన్నిఇన్నీ కావు. నచ్చనివారిని వేధించడం, తన, తన భార్య క్లయింట్లను కేసుల నుంచి రక్షించే ట్రాక్ రికార్డు కూడా ఈయన పేరున ఉంది.

సుబ్రమణ్య స్వామి మీద కోపంతో 1997లోనే ఆయన్ను అరెస్ట్ చేయించేందుకు అప్పటి దేవేగౌడ కేబినెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇతడి వ్యక్తిగత ద్వేషాన్ని పసిగట్టిన ప్రధాని దేవేగౌడ అరెస్ట్ వారెంట్లను రద్దు చేయించారు.

పుట్టపర్తి సత్యసాయిబాబా చనిపోయిన సమయంలో ఈయన హోంమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సాయిబాబా ట్రస్ట్‌కు చెందిన సంపద ట్రక్కులో తమిళనాడుకు తరలిపోయిందన్న వార్తలు పత్రికల్లో వచ్చాయి. ఆ సమయంలో చిదంబరం సత్యసాయిట్రస్ట్ వ్యవహారాల్లో కీలకంగా జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

రామోజీరావుకు చెందిన మార్గదర్శి కేసు ముందుకెళ్లకుండా కాంగ్రెస్‌ హయాంలో చిదంబరం పెద్ద గోడలా నిలబడ్డారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి అండగా ఉంటున్న ఒక పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు అన్ని సాక్ష్యాలు ఉన్నా… చిదంబరమే నేరుగా నాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి అరెస్ట్ కు అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

చంద్రబాబుతో ఉన్న స్నేహ ప్రభావంతో జగన్‌ను జైలుకు పంపడంతో చిదంబరం కాస్త అతి ఉత్సాహం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. కిరణ్‌కుమార్ రెడ్డిని సీఎం చేస్తే జగన్‌కు చెక్ పెట్టవచ్చంటూ కాంగ్రెస్ పెద్దలకు నూరిపోసిన వారిలో చిదంబరం ప్రధాన పాత్రధారి. కిరణ్‌ సీఎం అవడానికి చిదంబరం ఆశీస్సులే కారణం.

ఇలా హోంమంత్రిగా ఉన్నప్పుడు విర్రవీగిన చిదంబరం… గుజరాత్‌లో అమిత్ షాను అదే తరహాలో టార్గెట్ చేశాడు. సోహ్రుబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా పేరునూ షార్జ్ షీట్ లో చేర్చారు. అమిత్ షా ఆదేశాల మేరకే ఎన్‌కౌంటర్ చేశామంటూ ఒప్పుకోవాల్సిందిగా గుజరాత్ పోలీసు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

2010లో అమిత్ షాను సోహ్రుబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను చిదంబరం స్వయంగా పరిశీలించి… పలు అంశాలను జోడించి కేసును మరింత బలంగా మార్చే ప్రయత్నం చేశాడు. తాను అమిత్ షా కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను పరిశీలించింది వాస్తవమేనని ఒక సందర్భంలో చిదంబరం అంగీకరించాడు.

బెయిల్ పై వచ్చిన అమిత్ షా… గుజరాత్‌లో ఉంటే కేసులో సాక్ష్యాలు తారుమారు అవుతాయని సీబీఐ పిటిషన్ వేయడం వెనుక కూడా చిదంబరం హస్తముందని చెబుతుంటారు. ఆ పిటిషన్ కారణంగా హైకోర్టు ఆదేశాల మేరకు రెండేళ్ల పాటు అమిత్ షా గుజరాత్ వెలుపల బతికారు. ఆ కక్షతోనే చిదంబరం కేసుపై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారన్నది కాంగ్రెస్ ఆరోపణ.

చిదంబరంపై ఆర్థిక వ్యవహారాల కేసులు రెండేళ్లుగా వేలాడుతున్నాయి. ఇప్పటి వరకు వివిధ కోర్టుల్లో 20 బెయిళ్లు తెచ్చుకుని చిదంబరం బయట తిరిగారు. కానీ ఢి్ల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో ఈసారి చుక్కెదురైంది. దీంతో సీబీఐ అధికారులు ఆయన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు.

First Published:  22 Aug 2019 4:53 AM GMT
Next Story