మెగా అభిమానుల కోసం నాని ట్వీట్…. వర్కవుట్ అవుతుందా?

ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని త్వరలో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే నిజానికి ఈ టైటిల్ ని అనౌన్స్ చేసిన వెంటనే మెగా అభిమానులు చిత్ర బృందం పై విరుచుకుపడ్డారు. చిరు టైటిల్ ని నాని సినిమాకి ఎందుకు పెట్టారని ఫైర్ అయ్యారు.

తాజాగా చిరంజీవి 64వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మెగా అభిమానులకు దృష్టిని ఆకర్షించడం కోసం ఒక పోస్టర్ ను విడుదల చేసారు. 

ఆ ఎపిసోడ్ సినిమాలో కీలకంగా మారుతోందని తెలుస్తోంది. “మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సినిమా లోని ఒక పోస్టర్ ను చూపిద్దామని నిర్ణయించుకున్నాము. హ్యాపీ బర్త్ డే సార్. మీరు మా అందరికీ ఆదర్శం. హెచ్ బి డి ఎవర్ గ్రీన్ మెగాస్టార్” అంటూ క్యాప్షన్ పెట్టాడు నాని.

మరి ఈ పోస్టుతో నాని మెగా అభిమానులను కొంతైనా శాంత పరచగలిగాడా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు గ్యాంగ్ లీడర్ సినిమా మెగా హీరో వరుణ్ తేజ్ తదుపరి సినిమా ‘వాల్మీకి’ తో బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ 13న క్లాష్ అవ్వనుంది.