సెన్సార్ తీరుపై మండిపడుతున్న కాజల్

ఈ మధ్యనే ‘సీత’ , ‘రణరంగం’ సినిమాలతో డిజాస్టర్ లు అందుకున్న కాజల్ అగర్వాల్…. ఇప్పుడు తమిళంలో ‘క్వీన్’ సినిమా రీమేక్ అయిన ‘ప్యారిస్ ప్యారిస్’ తో బిజీగా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ వద్దకు వెళ్లింది.

అయితే తమిళ సెన్సార్ బోర్డు ఈ సినిమాలో బోలెడు కట్స్ పెట్టినట్లు తెలుస్తోంది. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం బోల్డ్ కంటెంట్ తమ సినిమాకి చాలా ముఖ్యమని మళ్లీ రివ్యూ కమిటీని కోరుతున్నారు.

తమిళ సెన్సార్ బోర్డ్ విషయంలో కాజల్ అగర్వాల్ కూడా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. హిందీలో సినిమాని ప్రజలు ఆదరించారు…. కానీ తమిళంలో మాత్రం ఎందుకు విడుదల కి ఇన్ని అడ్డంకులు పెడుతున్నారని ఆమె ప్రశ్నిస్తోంది.

అసలు ‘క్వీన్’ సినిమా తమిళంలో మాత్రమే కాక తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. కానీ ఆ మూడు సినిమాల విషయంలో కూడా సెన్సార్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కానీ తమిళ వెర్షన్ కి మాత్రమే ఇన్ని అభ్యంతరాలు ఎందుకు చెబుతున్నారని నిలదీస్తోంది కాజల్.