కరుణానిధి పాత్రలో…. మురళీ శర్మ

ఒకప్పటి నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే బోలెడు బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సినిమాలు మాత్రమే కాకుండా జయలలిత జీవిత చరిత్ర పై వెబ్ సిరీస్ కూడా త్వరలో విడుదల కాబోతోంది.

ఇందులో కంగనా హీరోయిన్ గా నటిస్తున్న ‘తలైవి’ సినిమా… హిందీలో ‘జయ’ అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి స్క్రిప్టు అందిస్తున్నాడు.

జయలలిత… సినీ జీవితం నుంచి రాజకీయ జీవితం వరకు కొన్ని కీలక అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే ప్రముఖ నటుడు అరవిందస్వామి ఈ సినిమాలో ఎంజీర్ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కరుణానిధి పాత్ర కోసం ప్రముఖ నటుడు మురళీ శర్మ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎంజీఆర్ మరియు జయ లలిత లకు కరుణానిధి గట్టి పోటీ ఇచ్చారు. ఆ పాత్ర కోసం మురళి శర్మ అయితే కచ్చితంగా సూట్ అవుతారని దర్శక నిర్మాతలు అతనిని సంప్రదించగా… మురళి శర్మ కూడా వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ రెండు మూడు నెలల్లో మొదలుకానుంది.