సాహో ఎఫెక్ట్…. పూర్తిగా మారిపోయిన ప్రభాస్

వెండితెరపై ప్రభాస్ కి నిజజీవితంలో ప్రభాస్ కి చాలా వ్యత్యాసం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ చాలా మొహమాటస్తుడు అని ఆయన సన్నిహితులు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ప్రభాస్ సాహో సినిమా కోసం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.

బాహుబలి నుంచి…. ప్రభాస్ ఈ మధ్య ప్రమోషన్స్ పై కూడా బాగానే దృష్టి పెడుతున్నాడు. తాజాగా సాహో ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ కపుల్ డాన్స్ షో నచ్ బలియే సీజన్ నైన్ కి అతిథులుగా వెళ్లారు.

అక్కడ జడ్జ్ అయిన రవీనాటాండన్ తో ప్రభాస్ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవీనా పైటకొంగు ని నోట్లో పెట్టుకుని ప్రభాస్ వేసిన స్టెప్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నిన్నమొన్నటిదాకా అందరితోనూ మొహమాటంతో మాట్లాడుతూ ఉన్న ప్రభాస్… ఇప్పుడు ఇలా ప్రవర్తించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఏదేమైనా యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. కాబట్టి ప్రభాస్ ప్రమోషన్స్ విషయంలో రాజీ పడటానికి లేదు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.