అప్పుడు స్వాతి…. ఇప్పుడు శృతి

నిఖిల్ సిద్దార్థ్ తన కెరీర్ లో ఎన్నడూ లేని విధం గా చాలా స్లో అయిపోయాడు. ఒకప్పుడు సినిమాలు హిట్ కాకపోయినా… వరుస సినిమాలతో ప్రేకకులముందుకు వచ్చిన నిఖిల్ ఇప్పుడు ఎందుకో బాగా వెనబడుతున్నాడు.

అయితే నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదల చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు విడుదల తేదీలను మార్చుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా విడుదలయ్యాక…. కార్తికేయ సినిమా కి రెండో భాగం చేయనున్నాడట. దర్శకుడు చందూ మొండేటితో ఈ సినిమా చేయనున్నాడు నిఖిల్. వీరు ఇద్దరు కలిసే మొదటి భాగం కూడా చేశారు.

ఇకపోతే ఈ కార్తికేయ రెండో భాగం లో హీరోయిన్ దొరికేసిందట. మొదటి భాగం లో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించగా, ఇప్పుడు ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి శర్మ ని ఎంపిక చేశారట. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో తెరంగేట్రం చేసిన శృతి శర్మ ని ఈ సినిమాకి తీసుకోవాలని అనుకున్నారట.

ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు, శృతి యొక్క ఎంపిక పై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.