Telugu Global
NEWS

తెలంగాణలో పూటకూళ్ల ఇళ్లు... పర్యాటక శాఖ కసరత్తు

పూటకూళ్లమ్మలు. సంచార జీవులకు పట్టెడన్నం పెట్టి ఆదరించిన మహా తల్లులు. నేటి తరానికి ఆ పేరే తెలియదు. గతంలో హొటళ్లు లేని ఆ కాలంలో పూటకూళ్లమ్మలే అన్నపూర్ణమ్మలు. ఇంత అన్నం పెట్టడమే కాదు… ఆ రాత్రికి బస కూడా ఏర్పాటు చేసేవారు. పూటకూళ్లమ్మ ఇళ్లే కాలక్రమంలో హొటళ్లుగా మారిపోయాయి. ఇప్నుడు మళ్లీ ఆనాటి పూటకూళ్లమ్మలను పర్యటక శాఖ మళ్లీ అతిధి సేవలో భాగం చేస్తోంది. తెలంగాణలో త్వరలో అలనాటి పూటకూళ్లమ్మల తరహాలో వసతి ఇళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు […]

తెలంగాణలో పూటకూళ్ల ఇళ్లు... పర్యాటక శాఖ కసరత్తు
X

పూటకూళ్లమ్మలు. సంచార జీవులకు పట్టెడన్నం పెట్టి ఆదరించిన మహా తల్లులు. నేటి తరానికి ఆ పేరే తెలియదు. గతంలో హొటళ్లు లేని ఆ కాలంలో పూటకూళ్లమ్మలే అన్నపూర్ణమ్మలు. ఇంత అన్నం పెట్టడమే కాదు… ఆ రాత్రికి బస కూడా ఏర్పాటు చేసేవారు. పూటకూళ్లమ్మ ఇళ్లే కాలక్రమంలో హొటళ్లుగా మారిపోయాయి.

ఇప్నుడు మళ్లీ ఆనాటి పూటకూళ్లమ్మలను పర్యటక శాఖ మళ్లీ అతిధి సేవలో భాగం చేస్తోంది. తెలంగాణలో త్వరలో అలనాటి పూటకూళ్లమ్మల తరహాలో వసతి ఇళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో జలపాతాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను మరింత ఆకట్టుకునే అటవీ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అంతే కాదు చరిత్రను కళ్లకు కట్టే చారిత్రక ప్రదేశాలు ఎక్కువగానే ఉన్నాయి.

అయితే ఇలాంటి పర్యాటక ప్రాంతాలలో పర్యాటకులకు వసతి సౌకర్యాలు చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో ఈ లోటు తీర్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ తీసుకువస్తున్న కొత్త విధానమే అలనాటి పూటకూళ్లమ్మ ఇళ్లు.

ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడుల్లో ఈ పూటకూళ్లమ్మ ఇళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు ఈ పూటకూళ్లమ్మ ఇళ్లు అదనపు ఆకర్షణ. కొన్ని పర్యాటక ప్రాంతాలలో సౌకర్యాలు లేకపోవడవంతో అక్కడ మాత్రమే ప్రత్యేకమైన సూర్యోదయం వంటివి చూడలేకపోతున్నారు పర్యాటకులు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హోమ్ స్టే పథకాన్ని ప్రారంభించింది. తమిళనాడు, రాజస్థాన్ లో ఈ పథకం అద్భుతంగా అమలవుతోంది. దీని వల్ల అక్కడికి పర్యాటకుల సంఖ్య తెలంగాణతో పోలిస్తే చాలా ఎక్కువ.

గతేడాది దేశంలో 1.5 కోట్ల మంది విదేశీ పర్యాటకులు వచ్చారని అంచనా. వారిలో 18 లక్షల మంది తమిళనాడులోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అదే తెలంగాణలో మాత్రం 3.8 లక్షల మంది మాత్రమే పర్యటించారు. ఇక పూటకూళ్లమ్మ ఇళ్లను పర్యాటకుల కోసం అందంగా తయారు చేస్తారు. ఈ ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండేలా చర్యలు తీసుకుంటారు.

పర్యాటక ప్రాంతాలలో కొన్ని ఎంపిక చేసుకున్న ఇళ్లతో పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకుని వారిని కూడా ఈ వ్యాపారంలో భాగస్వాములను చేస్తుంది. పర్యాటకులకు వారి ఇళ్లలోనే బస ఏర్పాటు చేయడంతో పాటు భోజనాది సౌకర్యాలను కూడా వారే చూసుకుంటారు.

దీని వల్ల మారుమూల ప్రాంతాలలో ఉండే వారికి ఉపాధి అవకాశాలను కల్పించినట్లు కూడా అవుతుందని పర్యాటక శాఖ భావిస్తోంది.

మరోవైపు తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించవచ్చునన్నది ఈ శాఖ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన పర్యాటక శాఖ…. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రంగంలోకి దిగుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ పూటకూళ్లమ్మ ఇళ్లలో ఆరు గదులను పర్యాటకులకు కేటాయిస్తారు. ఇంట్లో వైఫై, నీటి వసతి, నిద్రకు సంబంధించిన సకల ఏర్పాట్లు, ఏసీ, కూలర్లు వంటివి ఏర్పాటు చేస్తారు.

అయితే తమ ఇళ్లను పూటకూళ్లమ్మ ఇళ్లుగా ఇచ్చేందుకు సిద్ధమైన వారు పర్యాటక శాఖ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

First Published:  23 Aug 2019 12:08 AM GMT
Next Story