Telugu Global
Cinema & Entertainment

బన్నీ కి షాక్ ఇచ్చిన.... ఇద్దరు బాలీవుడ్ భామలు

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాలో నటించనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని దిల్ రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. బాలీవుడ్ హీరోయిన్ ఉంటే అల్లు అర్జున్ సినిమాకి […]

బన్నీ కి షాక్ ఇచ్చిన.... ఇద్దరు బాలీవుడ్ భామలు
X

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాలో నటించనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని దిల్ రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. బాలీవుడ్ హీరోయిన్ ఉంటే అల్లు అర్జున్ సినిమాకి హిందీలో కూడా మార్కెట్ పెరుగుతుందని ముందుగా అలియా భట్ ను సంప్రదించారట. అయితే అలియా తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోంది…. ఈ సినిమా ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం కాబట్టే ఒప్పుకున్నదట… ‘ఐకాన్’ కమర్షియల్ సినిమా అన్న కారణంతో ఆమె రిజక్ట్ చేసిందని చెబుతున్నారు.

దీంతో దిల్ రాజు మరో బాలీవుడ్ హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు.

తాజాగా ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన దిశా పటానిని సంప్రదించగా ఆమె భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసిందట. దీంతో దిల్ రాజు కూడా షాక్ అయ్యాడట. దీంతో ‘ఐకాన్’ యూనిట్ హీరోయిన్ ఎంపిక విషయంలో…. ఆలోచనలో పడ్డారట.

First Published:  24 Aug 2019 12:11 AM GMT
Next Story