Telugu Global
Health & Life Style

పోషకాహారంలో ఏపీ ఫస్ట్.... రాష్ట్రానికి రెండు జాతీయ అవార్డులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిరెండు జాతీయ అవార్డులు వరించాయి. పోషకాహార లోపాన్ని సరిదిద్దడంతో పాటు రాష్ట్రంలో శిశు మరణాలను తగ్గించేందుకు చేసిన కృషికి జాతీయ స్థాయి అవార్డు అందుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐసీడీఎస్ కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయి పురస్కారాన్ని పొందిన ఆంధ్రప్రదేశ్ కు ఈ సందర్భంగా కోటి రూపాయల నగదు నజరానా దక్కింది. దీంతో పాటు పోషకాహార పంపిణీలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రెండో స్థానం పొందడం విశేషం. ఈ అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల […]

పోషకాహారంలో ఏపీ ఫస్ట్.... రాష్ట్రానికి రెండు జాతీయ అవార్డులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిరెండు జాతీయ అవార్డులు వరించాయి. పోషకాహార లోపాన్ని సరిదిద్దడంతో పాటు రాష్ట్రంలో శిశు మరణాలను తగ్గించేందుకు చేసిన కృషికి జాతీయ స్థాయి అవార్డు అందుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఐసీడీఎస్ కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయి పురస్కారాన్ని పొందిన ఆంధ్రప్రదేశ్ కు ఈ సందర్భంగా కోటి రూపాయల నగదు నజరానా దక్కింది. దీంతో పాటు పోషకాహార పంపిణీలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రెండో స్థానం పొందడం విశేషం.

ఈ అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ దమయంతి, ఆ శాఖ సంచాలకులు డాక్టర్ కృతిక శుక్ల అందుకోవడం విశేషం.

దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటికే పోషకాహార పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం రావడం…. ఇప్పడు జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావడం పట్ల ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వ విభాగంలో ఇచ్చే అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు ప్రధానం చేశారు.

జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుకు అనంతపురం జిల్లా సింగనమల సీడీపీఓ జి. వనజ అక్కమ్మకు, క్షేత్రస్థాయిలో గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా పుత్తూరు కార్యకర్తలు అవార్డులను అందుకోవడం విశేషం.

వ్యక్తిగత అవార్డుల విషయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు కేంద్రస్థాయిలో పలువురు అధికారులు మద్దతు పలకడం విశేషం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఇంతియాజ్ ఈ అవార్డు అందుకోవడం విశేషమని పలువురు ఆయనను ప్రశంసించారు.

First Published:  23 Aug 2019 9:18 PM GMT
Next Story