”డిస్కో రాజా”… ఆ వార్తలు నిజమేనా?

‘రాజా ది గ్రేట్’ సినిమా తో భారీ గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు… కానీ తరువాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు భారీ డిజాస్టర్లు కావడంతో రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది. ప్రస్తుతం తన ఆశలన్నీ ‘డిస్కో రాజా’ సినిమాపైనే పెట్టుకున్నాడు రవితేజ.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే బోలెడు వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథలో ఒక ముసలి వ్యక్తి కనిపించకుండా పోయి మళ్ళీ పగ తీర్చుకోవడం కోసం ఒక యువకుడిగా వస్తాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక ఫొటో లీక్ అయింది. ఆ ఫొటో చూస్తే ఈ సినిమా కథ గురించి వచ్చిన వార్తలు నిజమేనని అనిపిస్తోంది.

ఆ ఫోటోలో యంగ్ గా కనిపిస్తున్న రవితేజ ఒక ముసలి వ్యక్తి తో సినిమా సెల్ఫీ తీసుకుంటూ కనిపిస్తాడు. అయితే ఇది మేకప్పా లేక సినిమా కోసం ఏదైనా గిమ్మిక్ చేశారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఏదేమైనా ఈ ఫొటో ఇప్పుడు సినిమాపై కొంచెం అంచనాలను పెంచుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి ఈ సినిమాతో రవితేజ మంచి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.