Telugu Global
NEWS

'కన్నా' ఎందుకు దిగజారాల్సి వస్తోంది?

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా సరే మతం పేరుతో ప్రజల మధ్య విభజన తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో కొన్ని ప్రత్యేక కోణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి… టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన చంద్రబాబుకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల పాత్ర. ఏపీ ప్రభుత్వంపై మత ముద్ర వేసేందుకు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి పాత్ర కీలకంగా కనిపిస్తోంది. మొన్న సీఎం రమేష్ ట్వీట్‌ను ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇబ్బందుల్లోకి […]

కన్నా ఎందుకు దిగజారాల్సి వస్తోంది?
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా సరే మతం పేరుతో ప్రజల మధ్య విభజన తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో కొన్ని ప్రత్యేక కోణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి… టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన చంద్రబాబుకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తుల పాత్ర.

ఏపీ ప్రభుత్వంపై మత ముద్ర వేసేందుకు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి పాత్ర కీలకంగా కనిపిస్తోంది. మొన్న సీఎం రమేష్ ట్వీట్‌ను ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టాలంటే తొలుత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో శత్రుత్వాన్ని సృష్టించాలన్నది… బీజేపీలోని చంద్రబాబు మనుషుల ఆలోచన. అందులో భాగంగానే బీజేపీ ముసుగులో చేరి వైసీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు మొదలుపెట్టారు.

ఇక బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ జీవితంలో బహుశా ఎన్నడూ ఇలా సున్నిమైన అంశాల ఆధారంగా రాజకీయం చేసి చలి కాచుకుని ఉండరు. ఇప్పుడు మాత్రం పదేపదే సున్నితమైన మతపరమైన వివాదాలను రాజేసేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడడం లేదు.

తాను ఏ పార్టీలో పెరిగాను? ఏ వ్యక్తుల వద్ద మంత్రిగా పనిచేశాను? రాజకీయ ఉనికి ప్రశ్నార్ధమైనప్పుడు ఏ పార్టీలో చేరేందుకు కండువాలు కూడా ముద్రించుకున్నాను? అన్న సంగతులు కూడా మరిచి… దేశంలో కాషాయ ఉద్దరణకే తాను జన్మించినట్టు మాట్లాడుతున్నారు.

నిన్న తిరుమల బస్‌ టికెట్లపై అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అని నిర్ధారణ జరిగినా ఇప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ… ఈ ప్రభుత్వాన్నే విమర్శిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

అమెరికాలో జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేయడానికి అక్కడ నూనె, ఒత్తి, అగ్గిపెట్టె కూడా లేవని తెలిసినా…. రాత్రి వరకు ఆ అంశంపై జగన్‌ను సోషల్ మీడియాలో కన్నా ప్రశ్నిస్తూనే వచ్చారు.

వివాదాస్పద వ్యక్తి అయిన రామచంద్రమూర్తిని శ్రీశైలం ఈవోగా తెచ్చింది చంద్రబాబు నాయుడు అని తెలిసినా… గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనికి ఈ ప్రభుత్వం అతడిపై బదిలీ వేటు వేసినా సరే దానికి కూడా ఈ ప్రభుత్వాన్నే కన్నా లక్ష్మీనారాయణ బాధ్యులను చేస్తూ మాట్లాడుతున్నారు.

గోశాలలో ఆవులు చనిపోయినా దాన్ని కూడా ముఖ్యమంత్రినే బాధ్యుడిని చేస్తూ ఒక నిరక్ష్యరాస్యుడిలా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడడం ఆయనలో ఎవరూ ఊహించని మార్పును సూచిస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ జేపీలో ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమేనన్న అభిప్రాయమూ ఉంది. చంద్రబాబుకు లెఫ్ట్‌ హ్యాండ్, రెడ్‌ హ్యాండ్‌గా ఉంటూ వచ్చిన నేతలు బీజేపీలో చేరిన తర్వాత పాత బీజేపీ నేతల ఉనికి కనుమరుగు అవుతోంది. ఇప్పటికే భారీగా టీడీపీ నేతలు… ఏపీ బీజేపీని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణకు ఎర్త్ పెట్టి… ఆయన స్థానంలో తమకు నమ్మకమైన వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించేందుకు కాషాయంలోని పసుపు రంగు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తనను మించిన కాషాయ అభిమాని లేరు అని చాటుకునేందుకే … కన్నా లక్ష్మీనారాయణ ఇలా సున్నితమైన అంశాలను కూడా వాడుకుంటున్నారన్న భావన ఉంది.

ఏపీ ప్రభుత్వంపై ధీటుగా పోరాటం చేయడంతోపాటు… ఏపీలో హిందుత్వ ఎజెండాను వ్యాప్తి చేయడానికి తానే సరైన వ్యక్తిని అన్న భావన హైకమాండ్‌లో కలిగించేందుకే కన్నా లక్ష్మీనారాయణ అసత్య ప్రచార వ్యాప్తికి వెనుకాడడం లేదన్నది పలువురి అభిప్రాయం.

కేవలం మతం ఆధారంగా…. పార్టీలో పట్టుసాధించాలనో, ప్రజల్లో పట్టుసాధించాలో బీజేపీ, టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు అంత ఈజీగా ఏపీలో ఫలిస్తాయనుకోలేం.

జగన్‌ ఎక్కడా చంద్రబాబులాగా గుళ్లు కూల్చే ఆలోచనతో లేరు. హిందువులను రెచ్చగొట్టాలన్న నీచ బుద్ధితో కూడా లేరు. తనకే నష్టం కలిగించే పనులను అధికారంలో ఉన్న జగన్‌ చేసే అవకాశం కూడా లేదు.

అలాంటప్పుడు పరిపాలనలో దొరకడం లేదు కాబట్టి మత పరంగా టార్గెట్‌ చేద్దామంటూ…. కృత్తిమ పరిస్థితులను సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు రగల్చాలనుకోవడం జన్మనిచ్చిన నేలకే ద్రోహం చేయడం అవుతుంది.

First Published:  24 Aug 2019 1:34 AM GMT
Next Story