Telugu Global
National

దేశం లోనే మొదటి సారి గిరిజన మహిళా డ్రైవర్లు...

దేశం లోనే మొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ మహిళలను మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఎం ఎస్ టి ఆర్ సి)లో బస్ డ్రైవర్లు గా నియమించనున్నది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం నాడు కార్పొరేషన్ చేపట్టిన ఆదివాసీ మహిళలకు శిక్షణ ఇచ్చి డ్రైవర్ ఉద్యోగం లోకి తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు లో భాగంగా 163 మంది గిరిజన స్త్రీలను హెవీ వెహికిల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడానికి సెలెక్ట్ […]

దేశం లోనే మొదటి సారి గిరిజన మహిళా డ్రైవర్లు...
X

దేశం లోనే మొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ మహిళలను మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఎం ఎస్ టి ఆర్ సి)లో బస్ డ్రైవర్లు గా నియమించనున్నది.

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం నాడు కార్పొరేషన్ చేపట్టిన ఆదివాసీ మహిళలకు శిక్షణ ఇచ్చి డ్రైవర్ ఉద్యోగం లోకి తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పైలట్ ప్రాజెక్టు లో భాగంగా 163 మంది గిరిజన స్త్రీలను హెవీ వెహికిల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడానికి సెలెక్ట్ చేశారు. వీరందరిని శిక్షణ అనంతరం ఎం ఎస్ టి ఆర్ సి లో చేర్చుకుంటారు.

ఈ శిక్షణ ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రావ్టె మాట్లాడుతూ… ప్రభుత్వం ఈ మహిళా డ్రైవర్ల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ” దేశం లోనే మొదటిసారిగా మహిళా డ్రైవర్ల సేఫ్టీ, సెక్యురిటీ కోసం చర్యలు తీసుకుంటున్నాము” అని అన్నారు.

ప్రతిభా పాటిల్ మాట్లాడుతూ… మహిళా డ్రైవర్ల భద్రత ను దృష్టిలో పెట్టుకుని వారిని ఇళ్లకు మరీ దూరంగా పంప వద్దని కోరారు. రాత్రి సమయం (నైట్ హాల్ట్)లో వారు ఉండటానికి భద్రమైన ప్లేస్ ని చూపెట్టాలని ఆమె ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.

“మహిళలకు విద్యను అందించి వారిని అభివృద్ధి వైపు తీసుకుపోవడం అంటే… మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడమే” అని అన్నారు.

డ్రైవర్ శిక్షణకు ఎన్నికైన ఈ మహిళలంతా మహారాష్ట్ర లోని గిరిజన ప్రాంతాలైన గడ్చిరోలి, వార్ధా, భండార-గోండియా జిల్లాలకు చెందిన వారు.

First Published:  24 Aug 2019 4:45 AM GMT
Next Story