Telugu Global
National

కొడుకు విదేశీయుడు... తల్లిదండ్రులు, తోబుట్టువులు భారతీయులా?

తూర్పు అస్సాంలోని జోర్హాట్ లో ఒక ట్రిబ్యునల్ ప్రస్తుతం బిఎస్ఎఫ్ లో పనిచేస్తున్న ముజిబుర్ రహమాన్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ని, అతడి భార్యను విదేశీయులు గా తీర్పు చెప్పింది. అయితే అతడి తల్లిదండ్రులను, తోబుట్టువులను స్వదేశీయులు గానే… అంటే భారతీయులు గానే గుర్తించడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. ఈ ట్రిబ్యునల్ జులై మాసంలో రహమాన్ వాదనను కనీసం విననైనా వినకుండా అతడిని విదేశీయుని గా ప్రకటించింది. ప్రస్తుతం పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్న రహమాన్ […]

కొడుకు విదేశీయుడు... తల్లిదండ్రులు, తోబుట్టువులు భారతీయులా?
X

తూర్పు అస్సాంలోని జోర్హాట్ లో ఒక ట్రిబ్యునల్ ప్రస్తుతం బిఎస్ఎఫ్ లో పనిచేస్తున్న ముజిబుర్ రహమాన్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ని, అతడి భార్యను విదేశీయులు గా తీర్పు చెప్పింది. అయితే అతడి తల్లిదండ్రులను, తోబుట్టువులను స్వదేశీయులు గానే… అంటే భారతీయులు గానే గుర్తించడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.

ఈ ట్రిబ్యునల్ జులై మాసంలో రహమాన్ వాదనను కనీసం విననైనా వినకుండా అతడిని విదేశీయుని గా ప్రకటించింది.
ప్రస్తుతం పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్న రహమాన్ నెల క్రితం సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు ట్రిబ్యునల్ నిర్ణయం తెలిసిందని అన్నారు.

అస్సాం పోలీసుల బోర్డర్ విభాగం తనను పచ్చి తాగుబోతుగా చిత్రిస్తూ… తనకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ కి రిపోర్టు ఇచ్చిందని ఆయన అన్నారు.

తమ కుటుంబం 1923 నుంచి అస్సాం గొలాఘాట్ జిల్లాలోని అస్సాం – నాగాలాండ్ సరిహద్దుల్లో ఉన్న ఉదయపూర్-మికిర్పట్టి (మెర్పాని) లో నివసిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని రహమాన్ చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఇదేవిధంగా భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ అధికారిని కూడా ఒక ట్రిబ్యునల్ విదేశీయుని గానే ప్రకటించింది.

కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సనావుల్లాని విదేశీయునిగా ప్రకటించి మే నెలలో ఆయనను గౌహతి లోని డిటెన్షన్ సెంటర్ కి పంపించింది. అయితే ఆయనకు బెయిల్ మంజూరైన మరుసటి రోజు… అంటే జూన్ 9న డిటెన్షన్ సెంటర్ నుంచి విముక్తి లభించింది.

ఇందుకోసం ఆయన దగ్గరనుంచి 20 వేల రూపాయల బాండ్, స్థానికంగా ఉన్న వారి నుంచి 2 షూరిటీలు, బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాతే విడుదల చేశారన్నది గమనార్హం. సనావుల్లా 30 ఏళ్ల పాటు భారత సైన్యంలో పని చేశారు.

First Published:  24 Aug 2019 3:02 AM GMT
Next Story