హిందీ ఇబ్బందే… తమిళమే బెటర్….

తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ మొదలు పెట్టి… ఆ తరువాత ముంబై వెళ్ళి… ఇప్పుడు చెన్నై చేరుకున్నాడు ప్రభాస్. తన కొత్త చిత్రం సాహో ఈ నెల 30 న విడుదల కానుండటంతో ఎక్కడ లేని సంతోషం అంతా ప్రభాస్ అభిమానుల్లో నిండుకుంది.

అయితే ఈ సినిమా ఆలస్యం అవుతూ ఉండటంతో అభిమానులు నిరాశ చెందినా… ఇప్పుడు ఉన్న క్రేజ్ కి సినిమా తప్పకుండ విజయం సాధిస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా ఈ రోజు చెన్నై లో మీడియా వాళ్ళ తో ముచ్చటించాడు ప్రభాస్. వాళ్ళ తో మాట్లాడుతూ తనకి హిందీ కన్నా తమిళమే సౌకర్యం గా ఉంటుందని చెప్పాడు. తదుపరి గా వచ్చే చిత్రాల్లో ప్రభాస్ తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటాడా అనే విషయం గురించి ఆరా తీయగా, ప్రభాస్ అందుకు బదులిస్తూ, మట్లాడేందుకు తనకి హిందీ కన్నా తమిళమే సౌకర్యం గా ఉంటుందని… భవిష్యత్తు లో కచ్చితంగా సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటాను అని చెప్పాడు ప్రభాస్.

సుజీత్ దర్శకత్వం లో రానున్న ఈ సినిమా లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.