Telugu Global
CRIME

నగ్నచిత్రం పంపండి.. ఉద్యోగం పట్టండి

ఇదో కొత్తరకం దారుణం.యువతులను మోసం చేసేందుకు ఓ దుర్మార్గుడి కొత్త ఆలోచన. ప్రముఖ హొటళ్లలో రిసెప్షనిస్ట్ ఉద్యోగం కావాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఒకే ఒక్క నగ్న చిత్రం పంపడమే. ఇలా చేస్తే ప్రముఖ హొటల్ లో మీకు ఉద్యోగం గ్యారంటీ అంటూ యువతులను మోసం చేస్తున్నాడు ఓ ఘరానా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇప్పటికే రెండు వేల మంది యువతల దిగంబర చిత్రాలను సేకరించిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నగరానికి చెందిన […]

నగ్నచిత్రం పంపండి.. ఉద్యోగం పట్టండి
X

ఇదో కొత్తరకం దారుణం.యువతులను మోసం చేసేందుకు ఓ దుర్మార్గుడి కొత్త ఆలోచన. ప్రముఖ హొటళ్లలో రిసెప్షనిస్ట్ ఉద్యోగం కావాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఒకే ఒక్క నగ్న చిత్రం పంపడమే. ఇలా చేస్తే ప్రముఖ హొటల్ లో మీకు ఉద్యోగం గ్యారంటీ అంటూ యువతులను మోసం చేస్తున్నాడు ఓ ఘరానా సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

ఇప్పటికే రెండు వేల మంది యువతల దిగంబర చిత్రాలను సేకరించిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నగరానికి చెందిన మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణానికి సంబంధిన నగ్న నిజాలు ఇలా ఉన్నాయి.

చెన్నైకి చెందిన క్లెయింట్ రాజు అలియాస్ ప్రదీప్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలను ఎరగా చూపిస్తూ వారి నగ్నచిత్రాలను సేకరించడం ప్రారంభించాడు. రాజధానిలోని ప్రముఖ హొటల్ రాడిసన్ లో రిసెఫ్షనిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయని, ఆసక్తి ఉన్న యువతులు తమ వివరాలను పంపాలంటూ క్వికర్.కామ్ లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలో ఇచ్చిన ఫొన్ లో సంప్రదించిన యువతులను తన హెచ్ ఆర్ మేనేజర్ అర్చన జగదీష్ వాట్సాప్ ద్వారా ఇంటర్వ్యూలు చేస్తారని నమ్మబలికాడు.

మరో నెంబర్ తో యువతులతో మాట్లాడి రిసెఫ్షనిస్ట్ అంటే అందంగా ఉండాలని, మీ నగ్న చిత్రాలను, వీలైతే వీడియోలను కూడా పంపాలంటూ ఆదేశించే వాడు. అంతే కాదు, ఏ యువతి అయినా తన ఫొటోలు పంపేందుకు ఆలస్యం చేస్తే మీరు చేతులారా మీ ఉద్యోగాన్ని, మంచి జీతాన్ని కోల్పోతున్నారని, వెంటనే మీ చిత్రాలు పంపాలంటూ హడావుడి చేసేవాడు.

ఇలా తెలివిగా మాట్లాడుతూ ఏకంగా 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది యువతులకు సంబంధించిన రెండు వేల చిత్రాలను సేకరించాడు క్లెయింట్ రాజు అలియాస్ ప్రదీప్.

ఈ మోసాన్ని గుర్తించిన మియాపూర్ కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలుసుకున్న వివరాలతో షాక్ తిన్నారు. చెన్నైకి చెందిన ప్రదీప్ ఈ మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తించిన పోలీసులు చెన్నై వెళ్లారు. అక్కడి స్ధానిక పోలీసుల సహాయంతో క్లెయింట్ రాజు అలియాస్ ప్రదీప్ ను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. అతడ్నిపూర్తిస్ధాయిలో విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇక ఉద్యోగాలను కల్పించే ఉచిత వెబ్ సైట్ క్వికర్ లో ఉన్న లోపాలను పూర్తి స్ధాయిలో విశ్లేషించుకున్న ప్రదీప్ హెచ్ఆర్, రిసెఫ్షనిస్టు ఉద్యోగాలకు ప్రత్యేక ప్రొఫైల్ ఉంటుందని గ్రహించి ఆ విభాగంలో యువతులను ఆకర్షించడం ప్రారంభించాడు.

కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ప్రదీప్ ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి నెలా ఒక్కో రాష్ట్ర్రంలో 4 లేదా 5 నగరాలలోని యువతులకు గాలం వేసే వాడు ప్రదీప్ అని పోలీసులు తెలిపారు.

First Published:  23 Aug 2019 11:02 PM GMT
Next Story