బిగ్ బాస్ హౌస్ లోకి… తెలుగు హీరోయిన్?

బిగ్ బాస్ హౌస్ మూడవ సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వారంలో హేమ… బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె వచ్చిన రెండవ వారమే ఎలిమినేట్ అయిపోయింది.

ఇప్పుడు తాజాగా గత వారం బిగ్ బాస్ హౌస్ లో నుంచి రోహిణి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు త్వరలో మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ని ఇంట్లోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ లిస్ట్ లో శ్రద్ధాదాస్, ఈషా రెబ్బ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా తెలుగు సెలబ్రిటీని పంపాలని నిర్ణయించుకున్నారట బిగ్ బాస్ నిర్మాతలు.

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ లలో ఈషా రెబ్బ పేరు మొదటగా చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలతో నటిస్తున్న ఈషా రెబ్బ హీరోయిన్ గా మాత్రం హిట్ అందుకోలేక పోతోంది. మరి బిగ్ బాస్ షో తోనైనా ఈమె ఇమేజ్ మారుతుందో లేదో చూడాలి. ఈమె ఎంట్రీ పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.