Telugu Global
National

9 గంటల్లో బ్రిడ్జి నిర్మించుకున్న గ్రామస్తులు

కర్ణాటకలోని ఓ గ్రామాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానించే బ్రిడ్జి వరదలకు కొట్టుకుపోయింది. ప్రభుత్వం వచ్చి దీన్ని తిరిగి నిర్మించడం ఇప్పట్లో జరగని పని అని గ్రహించిన ఆ గ్రామ వాసులు తామే ఓ చిన్న బ్రిడ్జిని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రొద్దున్నే లేచి పని ప్రారంభించి, సాయంత్రానికి బ్రిడ్జి నిర్మించుకున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా బ్రాహ్మణ కెప్పిగే ఒక చిన్న ద్వీపం. ఈ ఊరు ‘కలకట్టు’ అనే చిన్న నది మధ్య భాగంలో ఉంది. ఇందులో 75 ఇళ్లు ఉన్నాయి. […]

9 గంటల్లో బ్రిడ్జి నిర్మించుకున్న గ్రామస్తులు
X

కర్ణాటకలోని ఓ గ్రామాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానించే బ్రిడ్జి వరదలకు కొట్టుకుపోయింది. ప్రభుత్వం వచ్చి దీన్ని తిరిగి నిర్మించడం ఇప్పట్లో జరగని పని అని గ్రహించిన ఆ గ్రామ వాసులు తామే ఓ చిన్న బ్రిడ్జిని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రొద్దున్నే లేచి పని ప్రారంభించి, సాయంత్రానికి బ్రిడ్జి నిర్మించుకున్నారు.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా బ్రాహ్మణ కెప్పిగే ఒక చిన్న ద్వీపం. ఈ ఊరు ‘కలకట్టు’ అనే చిన్న నది మధ్య భాగంలో ఉంది. ఇందులో 75 ఇళ్లు ఉన్నాయి. కేవలం 100 మీటర్ల వంతెన ఆ ఊరు ను బాహ్య ప్రపంచంతో కలుపుతుంది.

ఆగస్టు 9న ఈ ఊరు ను కలిపే వంతెన భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. ప్రభుత్వ అధికారులు వచ్చి దాన్ని నిర్మించడానికి ఎక్కువ కాలం పడుతుందని తెలియడంతో…. అంతవరకు తమ కార్యకలాపాలు ఆపుకోలేరు కాబట్టి ఆ గ్రామస్తులు వెంటనే ఒక వంతెనను నిర్మించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.

స్థానిక వడ్రంగులు లోకన్న, మంజు, లక్ష్మణ్ ల పర్యవేక్షణలో ఓ కొత్త వంతెన కట్టుకున్నారు. అది కూడా 24 గంటల లోపే.
ఈ వంతెన నిర్మాణానికి స్థానికంగా అందుబాటులో ఉన్న మొద్దులు, కర్రలు వంటివాటిని ఉపయోగించారు.

ఉదయం 7:30కి పని ప్రారంభించి, సాయంత్రం 4:30 కి పూర్తి చేశారు. వెంటనే పాదచారులు, ద్విచక్ర వాహన దారులు దానిని ఉపయోగించుకోవడం ప్రారంభించారు.

First Published:  24 Aug 2019 1:12 AM GMT
Next Story