Telugu Global
National

విద్యార్ధులే కాదు... ఊరే మెచ్చిన ఉపాధ్యాయుడు

అతడో ప్రభుత్వ టీచర్. మూడేళ్ల క్రితం ఆ ఊరు బదిలీ పై వచ్చాడు. మళ్లీ బదిలీ అయింది. మరో స్కూల్ లో చేరటానికి బయలుదేరాడు. అతడికి వీడ్కోలు చెప్పడానికి ఊరు ఊరంతా బయలు దేరింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ అతడు వెళ్లిపోతున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఆయన విద్యార్థులైతే బోరున విలపించారు. ఊరంతా ఒక పక్క బాధ పడుతూనే డ్రమ్ముల లాంటి వాయిద్యాలతో తమ ప్రియతమ ఉపాధ్యాయుణ్ణి గ్రామం చివరి వరకు సాగనంపారు. […]

విద్యార్ధులే కాదు... ఊరే మెచ్చిన ఉపాధ్యాయుడు
X

అతడో ప్రభుత్వ టీచర్. మూడేళ్ల క్రితం ఆ ఊరు బదిలీ పై వచ్చాడు. మళ్లీ బదిలీ అయింది. మరో స్కూల్ లో చేరటానికి బయలుదేరాడు. అతడికి వీడ్కోలు చెప్పడానికి ఊరు ఊరంతా బయలు దేరింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ అతడు వెళ్లిపోతున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు.

ఇక ఆయన విద్యార్థులైతే బోరున విలపించారు. ఊరంతా ఒక పక్క బాధ పడుతూనే డ్రమ్ముల లాంటి వాయిద్యాలతో తమ ప్రియతమ ఉపాధ్యాయుణ్ణి గ్రామం చివరి వరకు సాగనంపారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇటువంటి దృశ్యం చాలా అరుదుగా మత్రమే కనిపిస్తుంది కదూ…

ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని బంకోలి గ్రామంలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీకి మూడేళ్ల క్రితం అశీష్ దంగ్వాల్ అనే టీచర్ వచ్చాడు. అతడు వచ్చేటప్పటికి స్కూల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అతడు తనదైన పద్ధతుల్లో విద్యా ప్రమాణాలను పెంచి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజల మన్ననలు పొందాడు.

సాధారణ బదిలీల్లో భాగంగా అశీష్ వేరే ఊరికి బదిలీ కావడంతో గ్రామస్తులు అయనను వదల లేక వదులుతూ… తమ ప్రేమ, ఆప్యాయతలు ఉట్టిపడేలా డోళ్లు వాయిస్తూ… విషాద వదనాలతో సాగనంపారు.

బాధ్యతలు మరచి ఇతర వ్యవహారాల్లో మునిగి పోయి, విద్యా బోధనను మరచి పోయే నేటి తరానికి చెందిన ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడు ఈ టీచర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

First Published:  24 Aug 2019 8:01 PM GMT
Next Story