Telugu Global
NEWS

వెనక్కు తగ్గని బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు…. తాను కట్టుబడే ఉన్నానని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జగన్ అమెరికా టూర్‌లో ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ అమరావతి ముంపు గురించి వ్యాఖ్యానించడంతో… జగన్ రాజధానిని మార్చేందుకు సిద్ధపడుతున్నారంటూ టీడీపీ పెద్దెత్తున విమర్శలు చేసింది. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమై ఉండవచ్చని కొందరి భావించారు. కానీ బొత్స సత్యనారాయణ ఆదివారం మరోసారి మీడియాతో మాట్లాడుతూ…. అమరావతిపై అవే వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి జగన్‌ […]

వెనక్కు తగ్గని బొత్స సత్యనారాయణ
X

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు…. తాను కట్టుబడే ఉన్నానని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జగన్ అమెరికా టూర్‌లో ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ అమరావతి ముంపు గురించి వ్యాఖ్యానించడంతో… జగన్ రాజధానిని మార్చేందుకు సిద్ధపడుతున్నారంటూ టీడీపీ పెద్దెత్తున విమర్శలు చేసింది. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమై ఉండవచ్చని కొందరి భావించారు.

కానీ బొత్స సత్యనారాయణ ఆదివారం మరోసారి మీడియాతో మాట్లాడుతూ…. అమరావతిపై అవే వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి జగన్‌ ఆలోచనలనే బొత్స సత్యనారాయణ చెబుతున్నట్టుగా అర్థమవుతోంది.

అమరావతి ముంపు ప్రాంతమేనని బొత్స వ్యాఖ్యానించారు. 8లక్షల క్కూసెక్కుల ప్రవాహానికే రాజధాని ప్రాంతం మునిగిపోయిందని… ఇక 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజధాని అన్నది కొందరు వ్యక్తులకో, ఒక వర్గానికో, పార్టీకో చెందినదిగా ఉండకూదన్నారు. తాను మంత్రి హోదాలోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా బొత్స స్పష్టంగా చెప్పారు.

రాజధానిపై పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు ద్వంద్వ ప్రమాణాలతో ఉన్నాయన్నారు. గతంలో అమరావతి ఒక కులానికి చెందినదిగా చెప్పిన పవన్ ఇప్పుడు మరోలా మాట్లాడడాన్ని బొత్స తప్పుపట్టారు.

శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని రాజధానిని ఎంపిక చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పడేసి మంత్రి నారాయణ సూచనలను పాటించడం వల్లే రాజధాని ముంపులో పడిపోయిందన్నారు బొత్స.

First Published:  25 Aug 2019 7:20 AM GMT
Next Story